సీఏ ఎలెవన్‌‌ కెప్టెన్‌‌గా బుమ్రా

సిడ్నీ: టీమిండియా పేసర్‌‌ జస్ప్రీత్‌‌ బుమ్రాకు మరో అరుదైన గౌరవం దక్కింది. క్రికెట్‌‌ ఆస్ట్రేలియా ప్రకటించిన ‘టెస్ట్‌‌ టీమ్‌‌ ఆఫ్‌‌ ద ఇయర్‌‌’కు బుమ్రాను కెప్టెన్‌‌గా ఎంపిక చేసింది. గతేడాది 13 మ్యాచ్‌‌ల్లో 71 వికెట్లు తీయడం బుమ్రా సూపర్‌‌ పెర్ఫామెన్స్‌‌‌‌‌కు నిదర్శనమని సీఏ వెల్లడించింది. ఇమ్రాన్‌‌ ఖాన్‌‌ (1982లో 62 వికెట్లు), డేల్‌‌ స్టెయిన్‌‌ (2008లో 74 వికెట్లు) తర్వాత ఆ స్థాయిలో బుమ్రా ప్రభావం చూపించాడని కితాబిచ్చింది.

యంగ్‌‌ బ్యాటర్‌‌ యశస్వి జైస్వాల్‌‌ను ఓపెనర్‌‌గా తీసుకుంది. అలెక్స్‌‌ క్యారీ, హాజిల్‌‌వుడ్‌‌, బెన్‌‌ డకెట్‌‌, జో రూట్‌‌, హ్యారీ బ్రూక్‌‌, రచిన్‌‌ రవీంద్ర, మ్యాట్‌‌ హెన్రీ, కమిందు మెండిస్‌‌, కేశవ్‌‌ మహారాజ్‌‌ మిగతా సభ్యులుగా ఉన్నారు.