టీమిండియా పేస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ఓ ఇంటివాడయ్యాడు. స్పోర్ట్స్ యాంకర్ సంజనా గణేషన్ మ్యారేజ్ చేసుకున్నాడు. ఇరువురు కుటుంబ సభ్యులు, పలువురు అతిథుల మధ్య వీరి పెళ్లి వేడుక గోవాలో ఘనంగా జరిగింది. ఇందులో భాగంగా తన పెళ్లి ఫోటోను బుమ్రా సోషల్ మీడియాలో షేర్ చేశాడు. తాను కొత్త ప్రయాణాన్ని మొదలుపెడుతున్నట్లు పోస్ట్ చేశాడు. కాగా బుమ్రా-సంజనా గణేషన్ జంటకు పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. త్వరలోనే భారత క్రికెటర్లతో పాటు సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులకు బుమ్రా ప్రత్యేకంగా విందు ఇవ్వనున్నట్లు సమాచారం తెలుస్తోంది. పెళ్లి కారణంగా ఇప్పటికే టీ20 సిరీస్‌కు దూరమైన అతడు భారత్-ఇంగ్లండ్ మధ్య మార్చి 23 నుంచి మూడు వన్డేల సిరీస్ ప్రారంభంకానుండగా.. ఈ సిరీస్‌లోనూ బుమ్రా ఆడే అవకాశం ఉందా..లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
