ఆ క్రెడిట్ బుమ్రాదే: సిరాజ్‌‌

కాన్‌‌బెర్రా: న్యూజిలాండ్‌‌తో సిరీస్‌‌లో చెత్త బౌలింగ్‌‌తో నిరాశపరిచిన ఇండియా పేసర్ మహ్మద్ సిరాజ్‌‌ పెర్తు టెస్టులో ఆసీస్‌పై ఐదు వికెట్లు పడగొట్టి ఆకట్టుకున్నాడు. తాను తిరిగి ఫామ్ అందుకోవడం వెనుక పేస్ లీడర్‌‌‌‌ జస్‌ప్రీత్ బుమ్రా సాయం ఉందని సిరాజ్‌‌ చెబుతున్నాడు. ‘నేను బుమ్రాతో తరచూ మాట్లాడుతూ ఉంటా. పెర్తు టెస్టుకు ముందు కూడా బుమ్రాతో మాట్లాడా. నా  పరిస్థితి ఎలా ఉందో  తనకు వివరించా. అప్పుడు బుమ్రాకు నాతో ఒకే మాట చెప్పాడు. 

నువ్వు వికెట్ల వెంట పడకు. ఒకే ప్రదేశంలో నిలకడగా బంతులు వేస్తూ.. నీ బౌలింగ్‌‌ను ఆస్వాదించు అన్నాడు. అప్పటికీ వికెట్లు పడకపోతే ఏం చేయాలో మళ్లీ నన్ను అడుగు అని చెప్పాడు. బుమ్రా సూచించినట్లుగానే నేను నా బౌలింగ్‌‌ను ఎంజాయ్ చేశా. వికెట్లు కూడా పడగొట్టాను’ అని   సిరాజ్ వివరించాడు.