IND vs AUS: ఈ విజయం అతనిదే.. భారత్‌ను ఒంటి చేత్తో గెలిపించిన కెప్టెన్

పెర్త్ టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించింది. ఒకదశలో ఓడిపోతుంది అనుకున్న మ్యాచ్ లో మన ఆటగాళ్లు అద్భుతంగా పుంజుకున్నారు. ముఖ్యంగా తొలి ఇన్నింగ్స్ లో 150 పరుగులజు ఆలౌట్ అయినా మన వాళ్ళు కంబ్యాక్ అత్యద్భుతం. సమిష్టిగా ఆడి భారత్ 295 పరుగుల తేడాతో ఈ విజయం సాధించినా.. అసలు భారత్ విజయానికి కారణమైన ఆటగాడు కెప్టెన్ ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా అని ఒప్పుకోవాల్సిందే. బుమ్రా పట్టుదల కారణంగానే భారత్ ఆశలు వదులుకున్న ఈ మ్యాచ్ లో గెలిచింది. 

తొలి ఇన్నింగ్స్ లో భారత్ 150 పరుగులకు ఆలౌటైంది సంగతి తెలిసిందే. అయితే ఈ దశలో ఏ ఒక్కరికీ భారత్ గెలుస్తుందనే ఆశలు ఏ మూల లేవు. ఆస్ట్రేలియా ఈజీగా 100 పరుగుల ఆధిక్యం సంపాదించినా ఈ మ్యాచ్ లో టీమిండియా ఓటమి ఖాయమని భావించారు. ఈ దశలో బుమ్రా అద్భుతం చేశాడు. కొత్త బంతితో ఆస్ట్రేలియాను హడలెత్తించాడు. స్టార్ ప్లేయర్లు స్మిత్, ఖవాజా వికెట్లను తీసి ఆసీస్ ను ఒత్తిడిలోకి నెట్టాడు.    

బుమ్రా ఇచ్చిన ఊపుతో మిగిలిన పేసర్లు విజృంభించారు. దీంతో ఆసీస్ ను కేవలం 104 పరుగులకే ఆలౌట్ చేయగలిగాం. రెండో ఇన్నింగ్స్ లోనూ మూడో రోజు ఆట ముగిసే సమయానికి రెండు వికెట్లు తీసి భారత్ విజయాన్ని ఖాయం చేశాడు. ఈ మ్యాచ్ లో తొలి ఇన్నింగ్స్ లో  5 వికెట్లు తీసిన బుమ్రా, రెండో ఇన్నింగ్స్ లో మరో మూడు వికెట్లు తీసుకొని ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు. ఓ వైపు బౌలర్ గా మరోవైపు ప్లేయర్ గా భారత జట్టును ముందుండి నడిపించాడు 

తొలి ఇన్నింగ్స్ లో భారత్ 150 పరుగులు చేసి ఆలౌట్ అయింది. నితీష్ కుమార్ రెడ్డి 41 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఆసీస్ బౌలర్లలో హేజల్ వుడ్ నాలుగు వికెట్లు పడగొట్టాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియా  భారత పేసర్ల ధాటికి 104 పరుగులకు ఆలౌట్ అయింది. బుమ్రా గా  వికెట్లతో కంగారుల పతనాన్ని శాసించాడు. రెండో ఇన్నింగ్స్ లో భారత్ 6 వికెట్ల నష్టానికి 487 పరుగుల వద్ద ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేసింది. జైస్వాల్ (161) కోహ్లీ (100) సెంచరీలతో చెలరేగారు. 534పరుగుల లక్ష్య ఛేదనలో ఆస్ట్రేలియా 242 పరుగులకే ఆలౌటైంది.