టెస్టు ర్యాంకింగ్స్ : టాప్-10లో బుమ్రా

టెస్టు ర్యాంకింగ్స్ : టాప్-10లో బుమ్రా

దుబాయ్ : టీమిండియా ప్రధాన ఫేసర్ బుమ్రా మరోసారి సత్తాచాటాడు. ఐసీసీ వన్డే బౌలింగ్ ర్యాంకింగ్స్ లో నంబర్ 1 ప్లేస్ లో కొనసాగుతున్న బుమ్రా..టెస్టు ర్యాంకింగ్స్ లోనూ రాణించాడు. మంగళవారం విడుదలైన లేటెస్ట్ టెస్టు ర్యాంకింగ్స్ లో బుమ్రా,, టాప్-10లో స్థానం సంపాదించి ఏడో స్థానానికి చేరాడు. అంతకుముందు బుమ్రా టెస్టు ర్యాంకు 15గా ఉంది. బుమ్రా టెస్టు ర్యాంకింగ్స్ లో టాప్-10లోకి రావడం ఇదే ఫస్ట్ టైం. టీమిండియా బౌలర్లలో బుమ్రా తర్వాత మహ్మద్ సమీ 19, ఇషాంత్ 21వ స్థానంలో ఉన్నారు.