మల్కల్​లో జపాన్ స్టూడెంట్స్ పర్యటన

గద్వాల, వెలుగు : గద్వాల జిల్లా మల్కల్ మండలంలోని నాగర్ దొడ్డి విలేజ్​లో జపాన్ దేశానికి చెందిన జపానీ యూనివర్సిటీ స్టూడెంట్స్ శుక్రవారం పర్యటించారు. స్పీడ్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో సేంద్రియ వ్యవసాయ తోటలను పరిశీలించారు.

సేంద్రియ వ్యవసాయం వల్ల కలిగే లాభాలను సీనియర్ అగ్రికల్చర్ సైంటిస్ట్ అశోక్ వారికి వివరించారు. కార్యక్రమంలో స్టూడెంట్స్ లీడర్ ఇనాగాకి, వివాసకి, డాక్టర్ అరుణ్, రవి ప్రకాశ్ తదితరులు ఉన్నారు.