ఆదిలాబాద్ జిల్లాలో ఫటాఫట్ వార్తలు ఇవే.. డోంట్ మిస్

​కాంగ్రెస్​లో చేరిన బీఆర్ఎస్ నాయకులు

జైనూర్, వెలుగు: జైనూర్, సిర్పూర్ (యు), లింగాపూర్ మండలాలకు చెందిన సుమారు 15 మంది బీఆర్ఎస్ ముఖ్య నాయకులు ఆదివారం కాంగ్రెస్ చేరారు. జిల్లా అధ్యక్షుడు విశ్వప్రసాద్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ కండువాలు కప్పుకున్నారు. మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు వర్గానికి చెందిన నాయకులు మాజీ వైస్ ఎంపీపీ చిర్లే లక్ష్మణ్, మెస్రం అంబాజిరావు, జన్నవార్ పవన్ కుమార్, పేందుర్ లచ్చు, ఆత్రం దత్తు, లింగాపూర్ మండల నాయకులు ఆత్రం అనిల్ కుమార్, ఆడే ఆత్మారాం, షేక్ సలీమ్, జాదవ్ నాను, సిర్పూర్ -యు ముఖ్య నాయకులు ఆత్రం ప్రకాశ్ తదితరులు కాంగ్రెస్​లో చేరారు. 

సర్వీస్ రోడ్డు సమస్యను పరిష్కరించాలి 

నిర్మల్, వెలుగు: సోన్ మండలం కడ్తాల్ గ్రామంలో సర్వీస్ రోడ్డు సమస్యను పరిష్కరించాలని డీసీసీ అధ్యక్షుడు శ్రీహరి రావును ఆదివారం ఆ గ్రామస్తులు కోరారు.  44 జాతీయ రహదారి వెడల్పులో భాగంగా గ్రామంలో ఫ్లై ఓవర్ నిర్మించారని, సర్వీస్ రోడ్డు లేకుండా రహదారిని ఏర్పాటు చేశారని వాపోయారు. గతంలో ఉన్న సర్వీస్ రోడ్డును రహదారిలో కలపడంతో రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయని, ప్రమాదాలు జరుగుతున్నాయని వాపోయారు.  స్పందించిన శ్రీహరి రావు మాట్లాడుతూ విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి, రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి దృష్టికి తీసుకువెళ్తా నని హామీ ఇచ్చారు.

 వెజ్ బిర్యానీలో చికెన్ ముక్క 

కాగ జ్ నగర్, వెలుగు: కాగజ్‌నగర్‌ పట్టణంలోని రాజీవ్ గాంధీ చౌరస్తా సమీపంలో ఉన్న ఓ హోటల్ లో వెజ్​ బిర్యానీలో చికెన్ ​ముక్క వచ్చింది. కాగజ్‌నగర్‌ పట్టణానికి చెందిన ఓ యువకుడు ఆదివారం తన ఫ్రెండ్​తో కలిసి న్యూ స్వాగత్ ​హోటల్​కు వెజ్ బిర్యానీ ఆర్డర్ చేశాడు. తినేటప్పుడు ఆ బిర్యానీలో చికెన్ ముక్క రావడంతో అవాక్కయ్యాడు. ఇదేమిటని హోటల్ సిబ్బందిని ప్రశ్నించగా..యాజమాన్యం నిర్లక్ష్యంగా సమాధానం చెప్పిందని మండిపడ్డారు. ఇందుకు సంబంధించి సోషల్​మీడియాలో పోస్ట్​ చేయగా.. వీడియో, ఫొటో వైరల్ అవుతున్నాయి. వెజ్ బిర్యానీ ఆర్డర్ చేస్తే చికెన్  పీస్ ఫ్రీ అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

 క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం

కుభీర్, వెలుగు: కుభీర్ మండల కేంద్రంలో మణికంఠ క్రికెట్ టీం అసోసియేషన్ ఆధ్వర్యంలో  చెంచుల సాయినాథ్ స్మారకర్థం ఆదివారం క్రికెట్​ టోర్నమెంట్ ప్రారంభించారు. ఈ పోటీలను ఎస్సై రవీందర్, మాజీ ఎంపీపీ జ్యోతి నాగేశ్ ప్రారంభించారు. పల్లెల్లో క్రీడలను ప్రోత్సహించాలనే ఉద్దేశ్యంతో టోర్నమెంట్ నిర్వహించడం అభినందనీయమని ఎస్సై అన్నారు. టోర్నీలో గెలుపొందిన జట్టుకు రూ.21వేలు, రన్నరప్​కు రూ.11 వేలు బహుమతిగా ఇవ్వనున్నట్లు నిర్వాహ కులు తెలిపారు. 

నేటి గ్రీవెన్స్ రద్దు

ఆదిలాబాద్, వెలుగు: ఆదిలాబాద్ జిల్లాలో మంత్రి సీతక్య పర్యటన నేపథ్యంలో కలెక్ట రేట్​లో ప్రతి సోమవారం నిర్వహించనున్న గ్రీవెన్స్ రద్దు చేసినట్లు కలెక్టర్ రాజర్షి షా ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కోరారు.

సమావేశాన్ని సక్సెస్ చేయండి

నేరడిగొండ, వెలుగు: ఏఐసీసీ ఆధ్వర్యంలో సోమవారం ఆదిలాబాద్​లో నిర్వహించే కాంగ్రెస్ సమీక్షా సమావేశాన్ని పార్టీ శ్రేణులు సక్సెస్ చేయాలని బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ చార్జ్ ఆడే గజేందర్ కోరారు. నేరడిగొండలో మాట్లాడుతూ.. జిల్లా కేంద్రంలో నిర్వహించే పార్లమెంట్ నియోజకవర్గస్థాయిలో సమావేశానికి ముఖ్య నేతలు వస్తున్నారని..  ఆయా మండలాల పార్టీ అధ్యక్షులు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు, యువజన కాంగ్రెస్ నాయకులు, తదితరులు పెద్ద ఎత్తున తరలివచ్చి సక్సెస్ చేయాలని కోరారు.

వెటర్నరీ అంబులెన్స్ బృందానికి అవార్డు 

బెల్లంపల్లి, వెలుగు: బెల్లంపల్లి మండలానికి చెందిన అత్యవసర వెటర్నరీ 1962 అంబు లెన్స్ బృందం పశురక్షణ రంగంలో రాష్ట్రస్థాయిలో అవార్డు అందుకున్నారు. ఉత్తమ ఉద్యోగులుగా బెల్లంపల్లి వెటర్నరీ డాక్టర్ బి.సుశ్వంత్ రెడ్డి, హెల్పర్ జి.సాయిశ్వర్ ఎంపికవగా.. ఆదివారం స్థానికంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వారికి ప్రోగ్రాం మేనేజర్ సామ్రాట్, ఈఎంఈ సంపత్ అవార్డు అందజేశారు.

స్లేట్ గ్రూప్స్ చైర్మన్  శ్రీకాంత్ రెడ్డికి డాక్టరేట్

జన్నారం, వెలుగు: స్లేట్ గ్రూప్స్ ఆఫ్ స్కూల్స్ చైర్మన్, లయన్స్ క్లబ్ మాజీ ప్రెసిడెంట్ ఏనుగు శ్రీకాంత్ రెడ్డి గౌరవ డాక్టరేట్ అందుకు న్నారు. శ్రీకాంత్​రెడ్డి చేస్తున్న విద్య, సామాజిక సేవలను గుర్తించిన మేరిల్యాండ్ స్టేట్ యూనివర్శిటీ (యూఎస్ఏ) డాక్టరేట్​ను ప్రదానం చేసింది. డిల్లీలో జరిగిన కార్యక్రమంలో అలహాబాద్ కోర్టు జడ్జి జేడుఖాన్ చేతుల మీదుగా శ్రీకాంత్ రెడ్డి డాక్టరేట్ తోపాటు గోల్డ్​మెడల్ అందుకున్నారు.