జనసేనకు 24 అసెంబ్లీ, 3 పార్లమెంట్ సీట్లు

ఏపీలో టీడీపీ, జనసేన పార్టీల సీట్ల సంఖ్యపై క్లారిటీ వచ్చింది. పొత్తులో భాగంగా జనసేన పార్టీకి 24 అసెంబ్లీ, 3 లోక్ సభ సీట్లు కేటాయించింది టీడీపీ. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు చంద్రబాబు, పవన్ కల్యాణ్. 24 అసెంబ్లీ స్థానాల్లో 5 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించారు నేతలు. 

జనసేన పోటీ చేసే నియోజకవర్గాలు, అభ్యర్థులు

నెల్లిమర్ల : లోకం మాధవి
అనకాపల్లి : కొణతాల రామకృష్ణ
రాజానగరం : బత్తుల రామకృష్ణ
కాకినాడ రూరల్ : పంతం నానాజీ
తెనాలి : నాదెండ్ల మనోహర్ 

మిగిలిన 19 స్థానాలకు అభ్యర్థులను తర్వాత ప్రకటించనున్నట్లు వెల్లడించారు జనసేన చీఫ్ పవన్ కల్యాణ్. మూడు లోక్ సభ నియోజకవర్గాలు, అక్కడ పోటీ చేసే అభ్యర్థులను తర్వాత వెల్లడించనున్నట్లు స్పష్టం చేశారు పవన్ కల్యాణ్. 2024, ఫిబ్రవరి 24వ తేదీ మంచి ముహూర్తం ఉండటంతో.. ఈ ప్రకటన చేస్తున్నట్లు తెలిపారు చంద్రబాబు.