జన్నారం బంద్ ప్రశాంతం... కవ్వాల్ టైగర్ జోన్ లోంచి వాహనాల రాకపోకలపై నిషేధం

జన్నారం బంద్ ప్రశాంతం... కవ్వాల్ టైగర్ జోన్ లోంచి వాహనాల రాకపోకలపై నిషేధం
  • అటవీశాఖ ఆంక్షలను 
  • నిరసిస్తూ బంద్ పాటించిన వ్యాపారులు

జన్నారం,వెలుగు: కవ్వాల్ టైగర్ జోన్ లోని జన్నారం మీదుగా భారీ వాహనాల రాకపోకలపై అటవీశాఖ విధించిన ఆంక్షలకు నిరసనగా చేపట్టిన బంద్ ప్రశాంతంగా ముగిసింది. ఆంక్షలు ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ సామాజిక కార్యకర్త శ్రీరాముల భూమాచారి వారం రోజులుగా మండల కేంద్రంలో రిలే దీక్ష చేపడుతున్నారు. 

శుక్రవారం జన్నారం బంద్ కు పిలుపునిచ్చారు. వ్యాపారవర్గాలు, ప్రైవేట్, ప్రభుత్వ స్కూల్స్, బ్యాంక్ లను ఉదయం నుంచే మూసివేయడంతో బంద్ సంపూర్ణమైంది. ఇప్పటికే భూమాచారి చేపట్టిన దీక్షకు బీఆర్ఎస్, బీజేపీ, కుల సంఘాలు మద్దతు తెలిపాయి.