సింధు నదిలో చిక్కుకున్న కారు

సింధు నదిలో చిక్కుకున్న కారు

జమ్ముకశ్మీర్ శ్రీనగర్ లోని నదిలో చిక్కుకున్న కారులోని నలుగురిని కాపాడారు భద్రతా బలగాలు. బల్తాల్ సమీపంలో ప్రమాదవశాత్తు సింధు నదిలో కారు పడిపోయింది. బల్తాల్- డోమెల్ దగ్గరున్న ఆర్మీ అధికారులు కారును గమనించి.. అందులో చిక్కుకున్న నలుగురిని రక్షించారు. జేసీబీ సాయంతో కారులోని వారిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.