జగన్ 100 రోజుల పాలనపై జనసేన బుక్ లెట్

జగన్ 100 రోజుల పాలనపై జనసేన బుక్ లెట్

సీఎం జగన్ వంద రోజుల పాలనపై తీవ్ర విమర్శలు చేశారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. వంద రోజుల పాలనపై 33 పేజీల బుక్ లెట్ రిలీజ్ చేసిన ఆయన జగన్ పాలనలో పారదర్శకత, దార్శనీకత లోపించిందన్నారు. 9 అంశాలతో వైసీపీ వంద రోజుల పాలనపై  నివేదిక విడుదల చేశారు. ఇసుక సమస్యలు,ఆర్థిక సమస్యలు,పెట్టుబడులపై జనసేన అధ్యయనం చేసిందన్నారు. జగన్ పాలన ప్రణాళిక బద్ధంగా లేదన్నారు పవన్. రెండు వారాల్లోనే ప్రభుత్వ నిర్ణయాలు ఆందోళనకరంగా మారాయన్నారు. వైసీపీ నవరత్నాలు జనరంజకమైనవి..పాలన జనవిరుద్ధమైనదని విమర్శించారు. టీడీపీని కూల్చింది ఇసుక మాఫియానే అని అన్నారు. ఇసుక మాఫియాను అరికట్టడంలో వైసీపీ విఫలమైందన్నారు. టన్ను ఇసుక రూ.375 అని చెప్పి రూ.500 వసూలు చేశారని ఆరోపించారు. రాష్ట్రం రూ.2.59 లక్షల కోట్ల అప్పుల్లో ఉందన్నారు.వైసీపీ క్యాడర్ కోసమే గ్రామ వ్యాలంటరీలు అని అన్నారు. పోలవరంలో టెండర్లలో అవకతవకలుంటే సరిచేయాలన్నారు.