జనసేనకు ఎదురుదెబ్బ: వైసీపీలోకి పిఠాపురం నేత..

ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో రాజకీయం రసవత్తరంగా మారింది. ఇప్పటికే అధికార ప్రతిపక్ష పార్టీలు అభ్యర్థులను ఖరారు చేసిన నేపథ్యంలో అన్ని పార్టీల్లో ఫిరాయింపులు ఊపందుకున్నాయి. ఈ క్రమంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో ఆ పార్టీకి గట్టి షాక్ తగిలింది. 2019 ఎన్నికల్లో జనసేన అభ్యర్థిగా పోటీ చేసిన మాకినీడి శేషకుమారి జనసేనకు రాజీనామా చేసి వైసీపీలో చేరాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.

పిఠాపురం నుండి టికెట్ ఆశించిన శేషకుమారి, ఆ టికెట్ దక్కకపోవడంతో ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అనుచరులతో చర్చించి నిర్ణయం తీసుకున్న శేషకుమారి తాడేపల్లిలో జగన్ సమక్షంలో పార్టీలో చేరనున్నారు. పవన్ కళ్యాణ్ పిఠాపురం నుండి పోటీ చేస్తానని ప్రకటించిన తర్వాత టీడీపీ నుండి పెద్దఎత్తున అసమ్మతి సెగ రాగలడమే కాకుండా ఇప్పుడు శేషకుమారి పార్టీని వీడటం పెద్ద షాక్ ఏ చెప్పాలి. మరి, పిఠాపురంలో విజయం సాధించి ఈసారి ఎలా అయినా అసెంబ్లీలో అడుగుపెట్టాలని భావిస్తున్న పవన్ ఏ మేరకు సక్సెస్ అవుతాడో చూడాలి.