ప్యాకేజీ స్టార్ అంటే చెప్పుతో కొడతా: పవన్

ప్యాకేజీ స్టార్ అంటే చెప్పుతో కొడతా: పవన్

వైసీపీ నేతలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిప్పులు చెరిగారు. తనను ప్యాకేజీ స్టార్ అంటే చెప్పుతో కొడతానంటూ చెప్పు చూపించి వార్నింగ్ ఇచ్చారు. ఇవాళ్టి నుంచి ఇక యుద్ధమే అని స్పష్టం చేశారు. ఏపీలో జనసేన ప్రభుత్వం ఏర్పడబోతోందని.. సీఎం అయితే రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంతో పాటు వైసీపీ తాట తీస్తానని వెల్లడించారు. తప్పుడు మాటలు మాట్లాడితే నిలబెట్టి తోలు వలుస్తా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో పార్టీ నేతలతో నిర్వహించిన సమావేశంలో పవన్ మాట్లాడారు.  

‘వైసీపీ గూండాల్లారా ఒంటి చేత్తో మెడ పిసికేస్తా.. ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే కుదరదు.. నా కుటుంబాన్ని కూడా వదలలేదు. చట్ట ప్రకారం విడాకులు ఇచ్చి భరణం చెల్లించాను. మొదటి భార్యకు రూ. 5 కోట్లు .. రెండో భార్యకు ఆస్తి రాసిచ్చా. రాజకీయ ముఖచిత్రం మారబోతోంది. సిద్ధంగా ఉండండి. వైసీపీ నేతలు ఉత్తరాంధ్రలో పర్యటించారా ? వైజాగ్ స్టీల్ ప్రైవేట్ పరం కాకుండా కృషి చేస్తా. కార్మిక సంఘ నేతలు ముందుకు రావాలి. బీజేపీ, ప్రధాని అంటే గౌరవం ఉంది.. కానీ వాళ్లకు ఊడిగం చేయం. మంత్రులపై దాడులు జరిగాయంటూ ప్రచారం చేస్తున్నారు. ఈ విషయంలో రాష్ట్ర గవర్నర్ వద్దకు నా బృందం వెళుతుంది. నేనేం లండన్ లో న్యూ యార్క్ లో పెరగలేదు’ అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.