పాలమూరు ఎస్పీగా జానకి ధారావత్

పాలమూరు/గద్వాల, వెలుగు: మహబూబ్​నగర్  కొత్త ఎస్పీగా జానకి ధారావత్  నియమితులయ్యారు. హైదరాబాద్  సౌత్ ఈస్ట్  జోన్  డీసీపీగా పని చేస్తున్న ఆయనను పాలమూరు ఎస్పీగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక్కడి ఎస్పీ హర్షవర్ధన్  సైబర్​ సెక్యూరిటీ బ్యూరో ఎస్పీగా బదిలీపై వెళ్లారు.

గద్వాలకు శ్రీనివాసరావు..

జోగులాంబ గద్వాల ఎస్పీగా శ్రీనివాసరావును నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2013 బ్యాచ్ కు చెందిన శ్రీనివాసరావు బాలానగర్  డీసీపీగా పని చేస్తున్నారు. ఇక్కడ పనిచేస్తున్న ఎస్పీ రితిరాజ్​ను ఏసీబీ జాయింట్​ డైరెక్టర్ గా ప్రభుత్వం బదిలీ చేసింది.