చేర్యాల ప్రాంతానికి నీళ్లందించాలి : పల్లా రాజేశ్వర్​రెడ్డి

చేర్యాల, వెలుగు: ప్రభుత్వం తపాస్​పల్లి రిజర్వాయర్​ను నింపి చేర్యాల సబ్​డివిజన్​లోని నాలుగు మండలాలకు నీళ్లందించాలని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్​రెడ్డి డిమాండ్​ చేశారు. సోమవారం మండల కేంద్రంలోని కల్యాణి గార్డెన్​లో ఏర్పాటు చేసిన సీఎంఆర్​ఎఫ్​ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. తపాస్​పల్లి రిజర్వాయర్​లోకి గోదావరి జలాలను తరలించి అక్కడి నుంచి చేర్యాల, మద్దూరు, ధూల్మిట్ట, కొమురవెల్లి మండలాల్లోని రైతులకు సాగునీరును అందించాలన్నారు. 

ఎంతమంది వచ్చినా నీలిమా హాస్పిటల్​లో ఉచిత వైద్యం అందిస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా 147 మందికి సీఎంఆర్​ఎఫ్​చెక్కులను అందజేశారు. అనంతరం వీరన్నపేట గ్రామంలో ఏర్పాటు చేసిన చాకలి అయిలమ్మ విగ్రహాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ కర్ణాకర్, కృష్ణారెడ్డి, మున్సిపల్​ చైర్​పర్సన్​ స్వరూపరాణి, వైస్​ చైర్మన్​ రాజీవ్​కుమార్​రెడ్డి, సర్పంచ్​ల ఫోరం మాజీ మండల అధ్యక్షుడు ఎల్లారెడ్డి, కౌన్సిలర్లు చంటి, సతీశ్​గౌడ్​, కనకలక్ష్మి, జుబేదా ఖతూర్​, నాగేశ్వర్​ రావు, మల్లేశం, మార్కెట్​మాజీ చైర్మన్​మల్లేశం గౌడ్​, చుక్కారెడ్డి, పర్వతాలు పాల్గొన్నారు.