మంత్రి పొంగులేటిని కలిసిన కొమ్మూరి

కొమురవెల్లి, వెలుగు : జనగామ నియోజకవర్గానికి ప్రత్యేక నిధులు కేటాయించాలని కోరుతూ జనగామ డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి మంగళవారం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డిని కలిశారు.

హైదరాబాద్​లోని సచివాలయంలో వారిని కలిసి ఇటీవల వర్షానికి పంటలు దెబ్బతిన్న రైతులకు, రోడ్డులకు ఎస్డీఫ్ నిధులు కేటాయించాలని కోరారు. ఆయన వెంట నియోజకవర్గంలోని అన్ని మండలాల అధ్యక్షులు, పట్టణ అధ్యక్షులు, కార్యకర్తలు ఉన్నారు.