కొండచరియలు విరిగిపడటంతో జమ్మూ–శ్రీనగర్ జాతీయ రహదారిని మూసివేసినట్లు ఇవాళ(సోమవారం) అధికారులు తెలిపారు. సమ్రోలి–ఉదమ్‌పూర్‌ల మధ్య ఉన్న ఈ రహదారిని మూసివేశామని, సహాయక చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు. గత కొన్ని రోజులుగా ఈ ప్రాంతంలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సోమవారం కూడా కనిష్ట ఉష్ణోగ్రత 10 డిగ్రీల సెల్సియస్‌కి పడిపోగా, గరిష్ట ఉష్ణోగ్రత 22 డిగ్రీలుగా నమోదు కావచ్చని ప్రాంతీయ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఆకాశం మేఘావృతం కావచ్చని అన్నారు.
#WATCH | Jammu and Kashmir: Operation underway to clear Jammu-Srinagar National Highway that is blocked at Dewal near Samroli, Udhampur due to a landslide. pic.twitter.com/241gIpNbkQ
— ANI (@ANI) February 28, 2022
మరిన్ని వార్తల కోసం..
