ఇది ఎక్కడో కాదు.. మన ఇండియాలోనే..

ఇది ఎక్కడో కాదు.. మన ఇండియాలోనే..
యూరప్ కంట్రీ కాదు.. శ్రీనగర్ రైల్వే స్టేషన్  ఢిల్లీలో పొగమంచు..జమ్మూలో చలిగాలి జీరో విజిబులిటీ వల్ల ఢిల్లీలో 50 ఫ్లైట్లు ఆలస్యం శ్రీనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నైట్ టెంపరేచర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మైనస్‌ 8.2 డిగ్రీలు రైల్వే స్టేషన్, ట్రాకులపై ఎటుచూసినా కొన్ని ఫీట్ల ఎత్తున పేరుకుపోయిన మంచు. ఆ మంచును తొలగిస్తున్న రైల్వే బండి.. చూసేందుకు ఏదో యూరప్ కంట్రీలోని రైల్వే స్టేషన్ మాదిరిగా ఉన్న ఈ సీన్ జమ్మూకాశ్మీర్ లోని శ్రీనగర్ రైల్వే స్టేషన్ వద్ద కన్పించింది. జమ్మూకాశ్మీర్ లో టెంపరేచర్లు విపరీతంగా పడిపోవడంతో భారీగా మంచు కురుస్తోంది. అన్ని చోట్లా ఇలా మంచు గుట్టలు గుట్టలుగా పేరుకుపోతోంది. దీంతో శ్రీనగర్ రైల్వే స్టేషన్ లో రైళ్లు వెళ్లేందుకు వీలుగా ట్రాక్స్​పై మంచును ఇలా తొలగిస్తున్నారు. శ్రీనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌/ న్యూఢిల్లీ: ఢిల్లీని పొగమంచు కమ్మేసింది. బుధవారం ఉదయం విజిబులిటీ జీరో మీటర్స్‌ గా నమోదైందని ఐఎమ్‌‌‌‌‌‌‌‌డీ అధికారులు చెప్పారు. దీంతో వెహికల్స్‌ పై వెళ్లే వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు . ఢిల్లీ ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పోర్ట్‌‌‌‌‌‌‌‌లో పొగమంచు విపరీతంగా ఉండటంతో దాదాపు 50 ఫ్లైట్లు ఆలస్యంగా నడిచినట్లు ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పోర్ట్‌‌‌‌‌‌‌‌ అధికారులు చెప్పారు. జీరో విజిబులిటీ నమోదవ్వడం ఈ ఏడాదిలో ఇది మూడోసారి అని అధికారులు చెప్పారు. ఆదివారం కూడా ఇదే పరిస్థితి కొనసాగే అవకాశాలున్నాయన్నారు. నగరంలో మినిమమ్‌‌‌‌‌‌‌‌ టెంపరేచర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 6.6 డిగ్రీలుగా నమోదైంది. లోధీ రోడ్‌‌‌‌‌‌‌‌ వాతావరణ కేంద్రంలో 5.8 డిగ్రీల సెల్సియస్‌‌‌‌‌‌‌‌ టెంపరేచర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నమోదైంది. శ్రీనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో… జమ్మూకాశ్మీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో చలి విపరీతంగా పెరిగిపోయింది. శనివారం ఉదయం నుంచి చలిగాలి వీస్తోంది. చాలా చోట్ల ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. శ్రీనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో శుక్రవారం రాత్రి మైనస్‌‌‌‌‌‌‌‌ 8.2 డిగ్రీల సెల్సియస్‌‌‌‌‌‌‌‌ టెంపరేచర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నమోదైంది. దాల్‌‌‌‌‌‌‌‌ లేక్‌‌‌‌‌‌‌‌ పూర్తిగా గడ్డకట్టిపోయింది. పైప్‌ లైన్స్‌ లో నీరు గడ్డకట్టిపోవడంతో.. వాటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సప్లై లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. తెల్లవారుజామున పొగమంచు కురవడంతో రోడ్లు కనిపించక వెహికల్స్‌ నడిపేవారు ఇబ్బందులు పడ్డారు . అమర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నా థ్‌ యాత్ర బేస్‌‌‌‌‌‌‌‌ క్యాంప్‌ పహల్‌‌‌‌‌‌‌‌గావ్‌ టూరిస్ట్‌‌‌‌‌‌‌‌ రిసార్ట్‌‌‌‌‌‌‌‌లో మైనస్‌‌‌‌‌‌‌‌ 9.4 డిగ్రీల సెల్సియస్‌‌‌‌‌‌‌‌ నమోదైనట్లు అధికారులు చెప్పారు. For More News.. ఎయిర్​పోర్ట్​ లాంటి రైల్వేస్టేషన్ మేయర్ సీటు కోసం లీడర్ల బిడ్డలు, కోడళ్ల లాబీయింగ్