మధురై: తమిళుల సాంప్రదాయ క్రీడ జల్లికట్టు ఈ నెల 15 నుంచి 17 వరకు జరగనుంది. పొంగల్ (సంక్రాంతి) పండుగ సందర్భంగా కనుమ రోజు జరిగే ఈ క్రీడకు తమిళనాడు ప్రభుత్వం గత వారమే అనుమతులిచ్చింది. అయితే ఈ ఏడాది కరోనా నేపథ్యంలో ఆటలో పాల్గొనే వారితో పాటు.. వీక్షించే ప్రేక్షకుల సంఖ్యను సగానికి తగ్గించింది. మధురైలోని కొన్ని ప్రాంతాల్లో జరిగే ఈ ఆటలో పాల్గోనే ఆటగాళ్లు పదిరోజుల ముందుగానే రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆటగాళ్లతోపాటు ఎద్దులకు మెడికల్ చెకప్ తప్పనిసరి. ఆటగాళ్ల సంఖ్య 150 కంటే ఎక్కువ ఉండకూడదని, వారికి COVID-19 నెగెటివ్ సర్టిఫికెట్లు కంపల్సరి అని ప్రభుత్వం ఆదేశించింది.
