తెలంగాణ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా జక్కిడి శివ చరణ్ రెడ్డి

తెలంగాణ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా జక్కిడి శివ చరణ్ రెడ్డి నియమించింది ఏఐసీసీ అధిష్టానం. ఈ మేరకు  ఉత్తర్వులు జారీ చేశారు అల్ ఇండియా యూత్ కాంగ్రెస్ అధ్యక్షడు ఉదయ్ భాను చిబ్ . ఈ మేరకు డిసెంబర్ 24న   ఢిల్లిలో  జక్కిడి శివ చరణ్ రెడ్డికి   నియామక పత్రాన్ని అందజేశారు ఉదయ్ భాను చిబ్.

ఇటీవల జరిగిన ఎన్నికల్లో యూత్ కాంగ్రెస్ స్టేట్ ప్రెసిడెంట్‌గా  జక్కిడి శివ చరణ్ రెడ్డి గెలుపొందిన సంగతి తెలిసిందే.. యూత్ కాంగ్రెస్ ఎన్నికల్లో 2,16,115 ఓట్ల తేడాతో ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్  ఓటమి పాలయ్యారు.