టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రాజమండ్రి జైలులో తన భద్రత, ఆరోగ్యంపై ఏసీబీ కోర్టు జడ్జికి లేఖ రాయడం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది చంద్రబాబు కుడి కంటికి కేటరాక్ట్ ఆపరేషన్ సంబంధించి.. రాజమండ్రి జీజీహెచ్ వైద్యులు పరీక్షలు నిర్వహించారని జైళ్ల శాఖ డీఐజీ రవికిరణ్ తెలిపారు. ఇమ్మెచ్యూర్ కేటరాక్ట్ ఉన్నట్టు గుర్తించారు. ఇప్పుడే ఆపరేషన్ అవసరం లేదని ఇంకా సమయం ఉందని వైద్యులు సూచించారు. చంద్రబాబు ఆరోగ్యానికి సంబంధించి తాము ఎటువంటి తప్పుడు రిపోర్టు బయటికి ఇవ్వటం లేదని డీఐజీ తెలిపారు. . పూర్తి వివరాలు కోర్టుకు పంపుతున్నామని తెలిపారు డీఐజీ రవికిరణ్.
చంద్రబాబు భద్రత విషయంలో మావోయిస్టు పార్టీ లెటర్ వచ్చిందనే విషయంపై జైళ్ల శాఖ డీఐజీ రవికిరణ్ స్పందించారు. ఈ లేఖ గురించి పూర్తిగా విచారణ జరిపించామని అది ఫేక్ లెటర్ అని నిర్దారణ అయిందన్నారు. . చంద్రబాబుకి 24 గంటలు మొదటి నుంచి సెక్యూరిటీ ఏర్పాటు చేశాం అన్నారు.. అదనంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని.. కంట్రోల్ రూమ్ నుంచి ఎప్పటికప్పుడు వాచ్ చేస్తున్నాం అన్నారు. చంద్రబాబును స్నేహ బ్యారేక్ లో చంద్రబాబును ఏ రూమ్ లో ఉంచామన్న విషయం బయటకు వెల్లడించడంలేదు.. కానీ, జైల్లో చంద్రబాబును ఫోటో తీసిన వ్యవహారంపై పోలీసులకు ఫిర్యాదు చేశామని… విచారణ చేస్తున్నాం.. చంద్రబాబు భద్రతకు సంబంధించి ఎటువంటి అనుమానాలు అవసరం లేదన్నారు.
చంద్రబాబు తనకు గతంలో ఉన్న ఎలర్జీల గురించి వైద్యులకు చెప్పారు.. దీనికి సంబంధించి కుటుంబ సభ్యులకు రెండు లెటర్లు రాశామని తెలిపారు.. చంద్రబాబు ఆరోగ్యానికి సంబంధించి వ్యక్తిగత వైద్యుడిని సంప్రదించి ఎటువంటి చికిత్స అవసరమవుతుందో సజెషన్స్ ఇవ్వమని భువనేశ్వరికి కూడా తెలియజేశామని.. . ఇదే విషయాన్ని కోర్టు కూడా తెలిపామని వెల్లడించారు జైళ్ల శాఖ డీఐజీ రవికిరణ్.