ప్రస్తుతం ఓటీటీ(OTT)లో సస్పెన్స్, క్రైమ్, థ్రిల్లర్ జానర్ వెబ్ సిరీస్ల హవా నడుస్తోంది. ఈ జానర్లో సిరీస్లు వస్తున్నాయంటే ఆడియన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రిలీజ్ డేట్ దగ్గర పడుతుందంటే.. ఏదో తెలియని జోష్లో ఉంటారు. ఇప్పుడు ఆడియన్స్ అందరు ఎగబడి మరీ చూసే ఓ వెబ్ సిరీస్ సీక్వెల్ వస్తోంది. అదే పాతాల్ లోక్ 2 (Pathal Lok2 ). థ్రిల్లర్ కాన్సెప్ట్తో ఒళ్ళు గగుర్పొడిచేలా ఉన్న ఈ సిరీస్ రెండో సీజన్ ఇప్పుడు స్ట్రీమింగ్కి రానుంది. వివరాల్లోకి వెళితే..
దర్శకుడు సుదీప్ శర్మ తెరకెక్కించిన పాతాల్ లోక్ సీజన్ 1 అమెజాన్ ప్రైమ్ లో రిలీజై సంచనలనం సృష్టించింది. 2020లో క్రైమ్ థ్రిల్లర్‌గా వచ్చిన ఈ సిరీస్ ఒక్కో సీన్, ఒక్కో షాట్ ప్రేక్షకులను మైండ్ పోయేలా చేసింది. ఇక మధ్యలో వచ్చే ట్విస్టులకి పిచ్చెక్కిపోవడం ఖాయం. ఊహకందని స్క్రీన్ ప్లేతో దర్శకుడు సుదీప్ శర్మ తెరకెక్కించిన ఈ సిరీస్ ఆధ్యంతం ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తుంది.దీంతో పాతాళ్ లోక్ సిరీస్ సీజన్ 2 కోసం ఆడియన్స్ తెగ ఎదురుచూస్తున్నారు.
పాతాల్ లోక్ సీజన్ 2 ఓటీటీ:
తాజాగా అమెజాన్ ప్రైమ్ వీడియో పాతాల్ లోక్ సీజన్ 2 రిలీజ్ డేట్ ప్రకటించింది. 2025 జనవరి 17 నుంచి ప్రైమ్లో అందుబాటులోకి రానున్నట్లు సంస్థ అధికారికంగా తెలిపింది. ఈమేరకు ఓ పోస్టర్ రిలీజ్ చేసింది. క్లీన్ స్లేట్ ఫిల్మ్స్ బ్యానర్పై అనుష్క శర్మ ఈ వెబ్ సిరీస్‌ని నిర్మించింది. జైదీప్ అహ్లావత్ మరియు గుల్ పనాగ్ కీలక పాత్రల్లో నటించారు.
Gates open this new year ?#PaatalLokOnPrime, New season, Jan 17 pic.twitter.com/gUVdgaxeKa
— prime video IN (@PrimeVideoIN) December 23, 2024
సీజన్ 1 కథేంటంటే::
హాతీరామ్ చౌదరి (జైదీప్ అహ్లావత్).. 20 ఏల్ల అనుభవం గల ఇన్ స్పెక్టర్. అతని చేతికి ప్రముఖ జర్నలిస్ట్ సంజీవ్ మెహ్రా(నీరజ్ కాబి) హత్య కేసు వస్తుంది. కెరీర్లో మొదటి హైప్రొఫైల్ కేసు కావడంతో.. తన సబార్డినేట్ అన్సారీ(ఇష్వక్ సింగ్)తో కలిసి దర్యాప్తు చేయడం ప్రారంభిస్తాడు. కేసు విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తాయి. దాని వెనుక పెద్ద రాజకీయ కుట్రే ఉందని తెలుసుకుంటాడు. ఆ హత్యా ఎవరు, ఎందుకు చేశారు? మధ్యలో CBI ఎందుకు ఇన్వాల్వ్ అయ్యింది? కేసు చివరకు ఎం జరిగింది అనేది మిగిలిన కథ.