బీజేపీకి ఓటు వేయవద్దన్నారు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. ఒకవేళ ఆ పార్టీకి ఓటేసి గెలిపిస్తే మీ ధర్మాన్ని మీరు పాటించలేరన్నారు. బుధవారం జర్‌గ్రాంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆమె.. బీజేపీ అధికారంలోకి వస్తే జై శ్రీరాం అని మాత్రమే చెప్పాల్సి వస్తుందని.. జై సియా రాం అని చెప్పేందుకు అవకాశం ఉండదన్నారు. బీజేపీ నేతలు కూడా జై శ్రీరాం అని మాత్రమే అంటారన్నారు. అంతేకాదు.. రాముడు దుర్గామాత భక్తుడని.. దుర్గామాతకు రాముడు పూజలు చేసేవాడని చెప్పారు. రాముడి కంటే దుర్గా మాత పెద్ద దైవమన్నారు మమతా.
బెంగాల్ ఎన్నికల పోలింగ్ మార్చి 15 నుంచి ఏప్రిల్ 17 వరకు ఎనిమిది విడతల్లో జరగనున్నాయి. ఫలితాలు మే 2న విడుదల కానున్నాయి.
