ఆగస్టు 23న చంద్రయాన్ - 3 ల్యాండింగ్ సందర్భంగా ప్రముఖ సైకతశిల్పి ఒడిశాలోని పూరీ తీరంలో 'జయహో ఇస్రో' అనే పేరుతో ఓ కళాకృతిని రూపొందించారు. ఈ శాండ్ ఆర్ట్ తో ఆయన ఇస్రో శాస్త్రవేత్తలు శుభాకాంక్షలు తెలియజేశారు.
చంద్రుని దక్షిణధ్రువంపై ఈ రోజు సాయంత్ర 6.05గంటలకు విక్రమ్ ల్యాండర్ ల్యాండ్ అవనున్న తరుణంలో ఈ ప్రక్రియ విజయవంతం కావాలని యావత్ దేశం ఆశిస్తోంది. ఇప్పటికే రెండు సార్లు పరాజయం పాలైన ఇస్రో శాస్త్రవేత్తలు ఈ ప్రయోగంతో ఎలాగైనా రికార్డు సృష్టించాలని, చరిత్ర తిరగరాయాలని భావిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రముఖ శాండ్ ఆర్టిస్ట్ సుదర్శన్ పట్నాయక్ అండ్ అతని బృందం ఓ అద్భుతమైన కళాఖండాన్ని రూపొందించింది.
ఇసుకతో రూపొందించిన ఈ కళాకృతిలో భారత జెండాతో చంద్రయాన్ - 3 చంద్రుని దక్షిణధ్రువంపై దిగినట్లుగా కనిపిస్తోంది. ఈ ల్యాండింగ్ సేఫ్ గా, సక్సెస్ ఫుల్ గా జరగాలని కోరుతూ దేశ వ్యాప్తంగా సర్వమత ప్రార్థనలు జరుగుతుండగా.. 'ఆల్ ది బెస్ట్ చంద్రయాన్' అని సుదర్శన్ పట్నాయక్ కూడా ఈ చిత్రంలో భాగంగా రూపొందించారు, ఇక ఈ ఆర్ట్ కు ఎగువ ఎడమ భాగాన 'జయహో ఇస్రో' అని కూడా ఇందులో రాశారు.
చంద్రయాన్ -3 ల్యాండింగ్ కార్యకలాపాల ప్రత్యక్షప్రసారం ఈ రోజు సాయంత్రం 5.20గంటలకు ప్రారంభం కానుంది. ఈ రోజున సాయంత్రం 5.27గంటల నుంచి ఇస్రో వెబ్ సైట్, అధికారిక యూట్యూబ్ ఛానెల్, ఫేస్ బుక్, పబ్లిక్ బ్రాడ్ కాస్టర్ డీడీ నేషనల్ టీవీలోనూ ల్యాండింగ్ ప్రత్యక్ష ప్రసారం అందుబాటులో ఉండనుంది.
ALL THE BEST ?? #Chandrayan3
— Sudarsan Pattnaik (@sudarsansand) August 22, 2023
My students created a sand art on #Chandrayaan 3 with the message "Jai Ho @isro , at Puri beach in Odisha. pic.twitter.com/SDbL8kpbEt
