శనివారం విజయవాడలో సీఎం జగన్ పై రాళ్ళ దాడి జరిగిన సంగతి తెలిసిందే. అపూర్వ స్పందనతో జరుగుతున్న యాత్రలో జగన్ పై ఈ దాడి జరగటంతో ఒక్కసారిగా రాష్ట్రమంతా ఉలిక్కి పడింది. దాడి తర్వాత ఒకరోజు విరామం తీసుకొని గాయంతోనే యాత్రను పునః ప్రారంభించారు జగన్. ఈ నేపథ్యంలో దాడిపై మొదటిసారి స్పందించారు జగన్. బస్సు యాత్రకు వస్తున్న ఆదరణ చూసే ఈ దాడికి పాల్పడ్డారని, ప్రజల ఆశీర్వాదం వల్లే ప్రాణాపాయం తప్పిందని అన్నారు.
మరోసారి అధికారంలోకి రాబోతున్నామని, ఇలాంటి దాడులు మనల్ని ఆపలేవని, ఎలాంటి ఆందోళన చెందొద్దని పార్టీ నేతలతో అన్నారు జగన్. దైర్యంగా ముందడుగు వేయాలని, దేవుడి దయ, ప్రజల ఆశీర్వాదం తనతో ఉన్నాయని అన్నారు. ఎవరూ అధైర్య పడద్దని పార్టీ నేతలతో అన్నారు జగన్. జగన్ వ్యాఖ్యల పట్ల పార్టీ శ్రేణులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దాడి తర్వాత ఆగిన చోటు నుండే ప్రారంభమైన యాత్రకు ప్రజల నుండి రెట్టించిన స్పందన వస్తోంది.