ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఎన్టీఆర్ జిల్లా బస్సు యాత్రలో దాడిపై మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. పథకం ప్రకారమే సీఎం జగన్‌పై దాడి చేశారని మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. జగన్‌కు వస్తున్న ప్రజాధరణ తట్టుకోలేక టీడీపీ నేతలు దాడి చేయించారని ఆయన అన్నారు. సీఎం జగన్‌పై స్కూల్ బిల్డింగ్ మీద నుంచి క్యాట్ బాల్‌తో దాడి చేసినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. విజయవాడ సిటీలో మూడున్నర గంటలుగా సీఎం జగన్ బస్సుయాత్రలో భారీ రోడ్ షో కొనసాగుతోంది. సీఎం జగన్‌కు వస్తున్న ప్రజాభిమానాన్ని ఓర్వలేక టీడీపీ వర్గాలే దాడికి తెగబడ్డారని విజయవాడ వైఎస్సార్‌సీపీ నేతలు అంటున్నారు.