స్పీడ్ పెంచిన జగన్ - ఇడుపులపాయలో మ్యానిఫెస్టో, ఇచ్ఛాపురం నుండి ప్రచారం

2024 ఎన్నికల్లో తిరిగి అధికార పీఠాన్ని చేజిక్కించుకోవటమే లక్ష్యంగా వైసీపీ అధినేత, సీఎం జగన్ వేగంగా పాలు కదుపుతున్నాడు. అన్ని పార్టీలకంటే ముందుగా ఎన్నికల శంఖారావాన్ని ఊది దూకుడు మీదున్న జగన్, ఫైనల్ లిస్ట్, మ్యానిఫెస్టోను రెడీ చేసి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించేందుకు సిద్దమయ్యాడు. ఈ నెల 16న ఇడుపులపాయలో పర్యటించనున్న జగన్ అక్కడే అభ్యర్థుల జాబితాను, ఎన్నికల మ్యానిఫెస్టోను ప్రారంభించనున్నాడు.

ప్రస్తుతం అమల్లో ఉన్న సంక్షేమ పథకాలతో పాటుగా పింఛన్ల పెంపు, డ్వాక్రా రుణమాఫీ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి ప్రజాకర్షక పథకాలు ఉండనున్నాయని తెలుస్తోంది. ఇడుపులపాయలో మ్యానిఫెస్టో రిలీజ్ చేసిన తర్వాత అక్కడి నుండి ఇచ్ఛాపురానికి బయల్దేరి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నాడు సీఎం జగన్. మరో రెండురోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ రానున్న నేపథ్యంలో జగన్ ప్లాన్ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. 

ALSO READ | చివరి నిమిషంలో షాకిచ్చిన ముద్రగడ, తాడేపల్లి ర్యాలీ రద్దు