లండన్ నుంచి తిరిగొచ్చిన సీఎం జగన్..

హోరాహోరీగా జరిగిన ఎన్నికల తర్వాత కుటుంబ సమేతంగా విదేశీ పర్యటనకు వెళ్లిన సీఎం జగన్ ఇవాళ తెల్లవారుజామున గన్నవరం చేరుకున్నారు. 15రోజుల విదేశీ పర్యటన తర్వాత రాష్ట్రానికి వచ్చిన ఆయనకు వైసీపీ శ్రేణులు ఘనస్వాగతం పలికారు. జగన్ లండన్ పర్యటనకు వెళ్లనున్నారని వార్తలొచ్చినప్పటి నుండి చర్చనీయాంశంగా మారింది ఓటమి భయంతోనే జగన్ లండన్ వెళ్తున్నాడంటూ ప్రచారం చేశాయి ప్రతిపక్షాలు.

అయితే ఆ తర్వాత టీడీపీ అధినేత చంద్రబాబు కూడా సతీసమేతంగా అమెరికా వెళ్ళటం, ఈ పర్యటన గురించి ఎక్కడా ప్రచారం కూడా లేకపోవటంతో అంత రహస్యంగా వెళ్లాల్సిన అవసరం ఏముందంటూ వైసీపీ కౌంటర్ ఇవ్వటంతో డిఫెన్స్ లో పడ్డారు టీడీపీ శ్రేణులు. ఇదిలా ఉండగా అమెరికా పర్యటన ముగించుకొని చంద్రబాబు ఇటీవలే తిరిగి రాగా, జగన్ ఇవాళ తెల్లవారుజామున రాష్ట్రానికి చేరుకున్నారు.

ఈ క్రమంలో జూన్ 4న ఎన్నికల కౌంటింగ్, ఇవాళ సాయంత్రం 6గంటల తర్వాత ఎగ్జిట్ పోల్స్ వెలువడనున్న నేపథ్యంలో ఇరు పార్టీల అధినేతలు కౌంటింగ్ పై దృష్టి పెట్టారు. మరి, ఉత్కంఠగా సాగిన ఎన్నికల్లో ఓటర్లు మళ్ళీ అధికార వైసీపీకి పట్టం కడతారా లేక కూటమికి అధికారం ఇస్తారా అన్నది వేచి చూడాలి.