ఏపీలో 15 రోజుల పాటు ఇళ్ల పండుగ

ఏపీలో 15 రోజుల పాటు ఇళ్ల పండుగ
ఏపీలో 30లక్షల మందికి పైగా పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తుండటం సంతోషంగా ఉందన్నారు ఏపీ సీఎం వైఎస్ జగన్. తూర్పు గోదావరి జిల్లా కొమరగిరిలో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని జగన్ ప్రారంభించారు. ఇళ్లు కట్టుకోవడంపై లబ్దిదారులకు మూడు ఆప్షన్స్ ఇచ్చారు. రెండు దశల్లో 28లక్షలకు పైగా ఇళ్లు నిర్మించి ఇస్తామన్నారు. 15 రోజుల పాటు పండుగలా.. ఇళ్ల పట్టాల పంపిణీ ఉంటుందన్నారు జగన్. రాష్ట్ర వ్యాప్తంగా 17005 కాలనీలు రాబోతున్నాయన్నారు. పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తుంటే కొందరు ఓర్వలేకపోతున్నారన్నారు. ఇళ్ల స్థలాలు ఇవ్వకూడదని హైకోర్టులో పిల్ వేశారన్నారు. పేదల సొంతింటి బాధ్యత కల నెరవేర్చడమే తమ బాధ్యతన్నారు జగన్.దరఖాస్తు చేసుకున్న మూడు నెలల్లో పరిశీలించి ఇళ్ల స్థలాలు పంపిణీ చేస్తామన్నారు. మాస్క్ ధరించని వాళ్లనుంచి రూ.115 కోట్ల ఫైన్ వసూలు