జగన్ ఆస్తుల కేసు మరో రాష్ట్రానికి బదిలీ కానుందా..! : సుప్రీంకోర్టులో ఏం జరిగింది..?

ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో సుప్రీంకోర్టులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) ధర్మాసనం నుంచి మరో ధర్మాసనానికి పిటిషన్‌ విచారణలో మార్పు జరిగింది.

రఘురామ పిటిషన్లు

జగన్‌ బెయిల్‌ రద్దు చేయాలని, విచారణను హైదరాబాద్‌ నుంచి మరో రాష్ట్రానికి బదిలీ చేయాలని రఘురామకృష్ణరాజు వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై జస్టిస్‌ సంజయ్‌ ఖన్నా ధర్మాసనం మంగళవారం(నవంబర్ 11) విచారణ జరిపింది. విచారణ ప్రారంభం కాగానే, ఈ పిటిషన్‌ ఆంధ్రప్రదేశ్‌కు చెందినదని జగన్‌ తరపు న్యాయవాది రంజిత్‌ కుమార్‌ న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. దాంతో, ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా.. రఘురామ పిటిషన్లను జస్టిస్ అభయ్‌ ఎస్‌ ఓకా నేతృత్వం వహించే బెంచ్‌కు బదిలీ చేశారు. డిసెంబర్‌ 2న విచారణకు పంపాలని రిజిస్ట్రీని ఆదేశించారు.

ఒకవేళ జస్టిస్ అభయ్‌ ఎస్‌ ఓకా ధర్మాసనం రఘురామ పిటిషన్లపై సానుకూలంగా స్పందిస్తే, కేసు మరో రాష్ట్రానికి బదిలీ కానుంది. ఏంటనేది వచ్చే నెల 12న తేలనుంది.