దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 70వ జయంతి సందర్భంగా ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆయనకు నివాళులర్పించారు. ఇడుపుల పాయలోని వైఎస్సార్ ఘాట్ సందర్శించిన జగన్ కుటుంబసభ్యులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. తర్వాత గండి ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు సీఎం జగన్. తర్వాత జమ్మలమడుగు బహిరంగ సభలో పాల్గొననున్నారు.
