మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్ర ద్వారా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు సీఎం జగన్. రాష్ట్ర వ్యాప్తంగా ప్లాన్ చేసిన ఈ యాత్ర ప్రస్తుతం ఎన్టీఆర్ జిల్లాకు చేరుకుంది. కనకదుర్గమ్మ వారధి మీదుగా జిల్లాకు చేరుకున్నారు జగన్. ఈ క్రమంలో వారధి పొడవున పెద్ద ఎత్తున జనం జగన్ కు స్వాగతం పలికారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అయ్యింది. జగన్ సత్తా ఇదీ అంటూ వైసీపీ శ్రేణులు సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు.
ఈ యాత్ర ప్రారంభించిన రోజు నుండి తమ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధి, అమలు చేసిన సంక్షేమ పథకాల గురించి వివరిస్తూ ప్రతిపక్షాలను ఎండగడుతూ వస్తున్నారు జగన్. మేమంతా సిద్ధం సభలకు మంచి రెస్పాన్స్ వస్తున్న నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో వైసీపీ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు వైసీపీ శ్రేణులు. జగన్ కూడా డబుల్ సెంచరీ ప్రభుత్వాన్ని స్తాపిద్దామన్న నినాదంతో కార్యకర్తల్లో జోష్ నింపుతున్నారు.