తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన బోటు ప్రమాదంలో చనిపోయిన వారి మృతదేహాలకు నివాళులర్పించారు ఏపీ సీఎం వైఎస్ జగన్. డెడ్ బాడీస్ ను స్వస్థలాలకు తరలించే ఏర్పాట్లను వేగంగా చేయాలని అధికారులను ఆదేశించారు. బాధిత కుటుంబాలకు అన్నివిధాలా అండగా ఉంటామని వారి కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చారు.
బోటు ప్రమాద ఘటనపై ఏపీ సీఎం జగన్ ఏరియల్ సర్వే చేశారు. ఉదయం తాడేపల్లి నుంచి హెలికాప్టర్ లో హోంమంత్రి సుచరితతో కలిసి సంఘటనా స్థలానికి వెళ్లారు. లాంచీ ప్రమాదం జరిగిన కచ్చులూరు ప్రాంతాన్ని… రెస్క్యూ ఆపరేషన్ ను ఏరియల్ సర్వేతో పరిశీలించారు. తర్వాత రాజమండ్రి ప్రభుత్వ ఆస్పత్రిలో బాధితులను పరామర్శించారు. గాయపడినవారిని పలకరించి ఆరోగ్య వివరాలు అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను ఆదేశించారు. సీఎం జగన్ వెంట తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్, ఇతర నాయకులు ఉన్నారు.

