బీజేపీ, బీఆర్ఎస్  మధ్య లోపాయికారి ఒప్పందం

జడ్చర్ల, వెలుగు : ఎంపీ ఎన్నికల సందర్భంగా బీజేపీ, బీఆర్ఎస్ లు లోపాయికారి ఒప్పందం చేసుకున్నాయని జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి ఆరోపించారు. సోమవారం పలు కార్యక్రమాల్లో పాల్గొని మాట్లాడారు. బీఆర్ఎస్  పార్టీ ఎంపీలు బీబీ పాటిల్, పోతుగంటి రాములు బీజే పీలో చేరడం ఇందుకు నిదర్శనమని చెప్పారు. మరికొంత మంది బీజేపీలో చేరే అవకాశం ఉందని తెలిపారు.

బీజేపీ, బీఆర్ఎస్​ పార్టీలు ఎన్ని జిమ్మిక్కులు చేసినా కాంగ్రెస్  పార్టీకి ఎదురు లేదన్నారు. 12కు పైగా ఎంపీ సీట్లు గెలుచుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. జడ్చర్లలో అర్హులైన జర్నలిస్టులకు ఇంటి స్థలంతో పాటు ఇండ్లు మంజూరు చేస్తా మని హామీ ఇచ్చారు. పట్టణ శివారులో నిర్మా ణంలో ఇండ్లను పరిశీలించి మిషన్  భగీరథ పైప్​లైన్, విద్యుత్  లైన్  ఏర్పాటు చేయాలన్నారు.

ఈ నెల 6న సీఎం పాలమూరు పర్యటనను సక్సెస్​ చేయాలని కోరారు. నిత్యా నందం, నర్సింహాచారి, జనార్ధన్ రెడ్డి, కుమ్మ రి రాజు, నిఖిల్ రెడ్డి, అనిల్ రెడ్డి, అల్వాల్ రెడ్డి, రాజు, వీరస్వామి, కృష్ణయ్య పాల్గొన్నారు.