ఇంగ్లాండ్ యువ క్రికెటర్ జాకబ్ బెథెల్ క్రికెట్ లో శరవేగంగా దూసుకుపోతున్నాడు. రెండు నెలల వ్యవధిలోనే మూడు ఫార్మాట్ లలో అరంగేట్రం చేసి ఔరా అనిపించాడు. ఒక ప్లేయర్ ఇంత ఫాస్ట్ గా మూడు ఫార్మాట్ లు ఆడడం ఈ ఇంగ్లాండ్ క్రికెటర్ కే చెల్లింది. ఇటీవలే జరిగిన ఐపీఎల్ మెగా ఆక్షన్ లో బెథెల్ ను రూ. 2.6 కోట్లకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు దక్కించుకుంది. పవర్ హిట్టింగ్ తో పాటు స్పిన్ కూడా వేయగల ఈ యువ ప్లేయర్ పై భారీ అంచనాలు ఉన్నాయి.
జాకబ్ బెథెల్ తన ధనాధన్ బ్యాటింగ్ తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అభిమానులను ఖుషీ చేశాడు. న్యూజిలాండ్ తో జరుగుతున్న రెండో టెస్టులో వన్డే రీతీలో బ్యాటింగ్ చేస్తూ బౌండరీల వర్షం కురిపించాడు. 118 బంతుల్లో 10 ఫోర్లు.. 3 సిక్సర్లతో 96 పరుగులు చేసి కివీస్ కు చుక్కలు చూపించాడు. నాలుగు పరుగుల వ్యవధిలో సెంచరీ కోల్పోయినా అతని ఇన్నింగ్స్ మాత్రం అద్భుతం. ఈ ఇన్నింగ్స్ తో ఆర్సీబీ అభిమానాలు తెగ ఖుషీ అయిపోతున్నారు. ఐపీఎల్ సమయానికి ఇతని నుంచి మరిన్ని మెరుపు ఇన్నింగ్స్ లు వస్తాయని ఆర్సీబీ ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.
Also Read :- హెడ్ మెరుపు సెంచరీ.. భారీ ఆధిక్యం దిశగా ఆస్ట్రేలియా
ఈ టెస్ట్ మ్యాచ్ విషయానికి వస్తే రెండో ఇన్నింగ్స్ లో భారీ స్కోర్ తో ఇంగ్లాండ్ పట్టు బిగిస్తుంది. రెండో రోజు తా ముగిసే సమయానికి 5 వికెట్ల నష్టానికి 378 పరుగులు చేసింది. ప్రస్తుతం ఇంగ్లాండ్ 533 పరుగుల భారీ ఆధిక్యంలో ఉంది. తొలి ఇన్నింగ్స్ లో న్యూజిలాండ్ కేవలం 125 పరుగులకే ఆలౌట్ కాగా.. మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ లో 280 పరుగులకు ఆలౌట్ అయింది.