ENG vs NZ: న్యూజిలాండ్ పర్యటన.. ఇంగ్లండ్ జట్టులో చిచ్చర పిడుగు

వచ్చే నెలలో న్యూజిలాండ్‌తో జరగనున్న మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ కోసం ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు(ECB) తమ జట్టును ప్రకటించింది. బెన్ స్టోక్స్ నాయకత్వంలో 16 మంది సభ్యులతో కూడిన జట్టును ఎంపిక చేసింది. ఇటీవల ఇంగ్లండ్ తరపున పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ఆరగ్రేటం చేసిన ఆల్ రౌండర్ జాకబ్ బెథెల్‌.. టెస్ట్ కాల్ అందుకున్నాడు.

వికెట్ కీపర్/ బ్యాటర్ జేమీ స్మిత్ భార్య బిడ్డకు జన్మనివ్వడానికి రోజులు దగ్గరపడటంతో అతను ఈ సిరీస్‪కు దూరంగా ఉన్నాడు. స్మిత్ స్థానంలో జోర్డాన్ కాక్స్‌ జట్టులోకి వచ్చాడు. స్మిత్ గైర్హాజరి నేపథ్యంలో కాక్స్ వికెట్ కీపింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తాడని ఈసీబీ ఒక ప్రకటనలో తెలిపింది.

ఇంగ్లండ్, న్యూజిలాండ్ జట్ల మధ్య నవంబర్ 28 నుంచి టెస్ట్ సిరీస్ ప్రారంభం కానుంది.

షెడ్యూల్:

  • మొదటి టెస్ట్ (నవంబర్ 28- డిసెంబర్ 02): క్రైస్ట్ చర్చ్
  • రెండో టెస్ట్ (డిసెంబర్ 06 - 10): వెల్లింగ్‌టన్‌
  • మూడో టెస్ట్ (డిసెంబర్ 14- 18): హామిల్టన్‌

న్యూజిలాండ్‌ సిరీస్‌కు ఇంగ్లండ్ జట్టు: బెన్ స్టోక్స్ (కెప్టెన్), రెహాన్ అహ్మద్, గుస్ అట్కిన్సన్, షోయబ్ బషీర్, జాకబ్ బెథెల్, హ్యారీ బ్రూక్, బ్రైసన్ కార్సే, జోర్డాన్ కాక్స్(వికెట్ కీపర్), జాక్ క్రాలే, బెన్ డకెట్, జాక్ లీచ్, ఆలీ పోప్, మాథ్యూ పాట్స్, జో రూట్ , ఆలీ స్టోన్, క్రిస్ వోక్స్.