ప్రపంచంలోనే అత్యంత గట్టిగా ఉండే ఫైబర్ ‘డైనీమా’. ఇప్పుడు ఈ ఫైబర్ తోనే జాకెట్ తయారు చేసింది ఒక సంస్థ. స్పోర్ట్స్ , అడ్వెంచర్ క్లోత్స్ తయారు చేసే ‘వోల్లెబాక్ ’ అనే సంస్థ ఈ జాకెట్ ను రూపొందించింది. ఈ జాకెట్ బయటివైపు నిర్ మాణం స్టీల్ కంటే పదిహేను రెట్లు గట్టిగా ఉంటుందని ఆ కంపెనీ చెపుతోంది. ఇది బయటివైపు గట్టిగా ఉన్నప్పటికీ, లోపల మాత్రం చాలా మెత్తగా ఉంటుంది. రెండున్నర కిలోలకు పైగా బరువు.
ఈ జాకెట్ లైఫ్ టైమ్ పని చేస్తుందని ‘వోలెబ్యాక్ ’ తెలిపింది. చలికాలంలో ఇది మంచి రక్షణనిస్తుంది. దీన్ని ‘ఇన్ డిస్ట్రక్టిబుల్ పఫ్ఫర్ ’ అని కూడా పిలుస్తారు. అంటే ఇది ఎప్పటికీ పాడవకుండా ఉంటుందని అర్థం. దీని ధర దాదాపు అరవై వేల రూపాయల పైనే ఉంటుంది.
