చేర్యాల రెవెన్యూ డివిజన్ చేయాలని మంత్రికి వినతి

చేర్యాల, వెలుగు: చేర్యాలను రెవెన్యూ డివిజన్ గా ప్రకటించాలని కోరుతూ బుధవారం జనగామ డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాపరెడ్డి ఆధ్వర్యంలో  మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి జేఏసీ నాయకులు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా చేర్యాల రాజకీయ, భౌగోళిక పరిస్థితుల గురించి వివరించారు. 

అనంతరం మంత్రి పొంగులేటి సానుకూలంగా స్పందించి పది రోజుల్లో సమావేశాన్ని ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో  జేఏసీ చైర్మన్ పరమేశ్వర్, ఆగంరెడ్డి, గిరి కొండల్ రెడ్డి, అందె అశోక్, బీరయ్య తదితర జేఏసీ నాయకులు పాల్గొన్నారు.