రెవెన్యూ డివిజన్​ కోసం మంత్రులను కలుస్తాం : జేఏసీ చైర్మన్ పరమేశ్వర్

చేర్యాల, వెలుగు: చేర్యాల రెవెన్యూ డివిజన్ ​ఏర్పాటు కోసం ఈ నెల 20 తర్వాత మంత్రుల బృందాన్ని కలసి ఈ ప్రాంత ఆకాంక్ష, ఆవశ్యకతను తెలియజేస్తామని జేఏసీ చైర్మన్ పరమేశ్వర్ తెలిపారు. మంగళవారం మండల కేంద్రంలోని జేఏసీ ఆఫీసులో మాజీ ఎంపీపీ, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ఉమారణి అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గత నెలలో కలెక్టర్ కు వినతిపత్రం సమర్పించిన సందర్భంలో డివిజన్ ఏర్పాటుకు కలెక్టర్ సానుకూల వైఖరి తెలియజేయడం వల్ల వారికి కృతజ్ఞతలు తెలుపుతూ తీర్మానం ప్రవేశ పెట్టారు. 

రెవెన్యూ డివిజన్ పోరాటాన్ని మరింత తీవ్రతరం చేయడంలో భాగంగా పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డిని కలుస్తామన్నారు. సమావేశంలో జేఏసీ ప్రతినిధులు ఆగంరెడ్డి, అశోక్, బీరయ్య, యాదయ్య, నర్సింగ రావు, శ్రీకాంత్, మల్లేశం, యాదయ్య, భాస్కర్, రమణా రెడ్డి, బాలరాజు, లింగమూర్తి, లక్ష్మీ నారాయణ, సత్యనారాయణ,  భూమయ్య, జహీరుద్దీన్, రాజిరెడ్డి, లక్ష్మారెడ్డి, మహేందర్ రెడ్డి, ఉదయ్ రెడ్డి, బాల నర్సయ్య, చంద్రం, వెంకటాద్రి, వినీత్, వెంకటేశం పాల్గొన్నారు.