అల్లు అర్జున్ అరెస్టు.. స్పందించిన కేంద్ర మంత్రి బండి సంజయ్

అల్లు అర్జున్ అరెస్టుపై కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ స్పందించారు. సంధ్య థియేటర్‌ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో మహిళ మరణించడం దురదృష్టకరమని బండి సంజయ్ అన్నారు. ఈ ఘటనకు కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యమే కారణమని ఆరోపించారు. 

అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప: ది రూల్‌ సినిమాపై అభిమానుల్లో భారీ అంచాలనున్నయన్న విషయం ప్రభుత్వానికి ముందే తెలుసని.. ఆ జనాదరణను బట్టి సరైన ఏర్పాట్లు చేయకపోవడం వల్లే ఈ ఘటన జరిగిందని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు.   

ALSO READ : అల్లు అర్జున్ అరెస్టుపై.. సీఎం రేవంత్ రెడ్డి స్పందన ఇదే..!

జాతీయ అవార్డు గ్రహీత అయిన అల్లు అర్జున్‌కు కనీసం బట్టలు మార్చుకునే సమయం కూడా ఇవ్వకుండా తన బెడ్‌రూమ్‌లోకి ప్రవేశించి అతన్ని తీసుకురావడం అవమానకరమైనదని బండి సంజయ్ అన్నారు. భారతీయ సినిమాకు ప్రపంచ గుర్తింపు తెచ్చిన అల్లు అర్జున్‌ పట్ల పోలీసులు ప్రవర్తించిన తీరు సరైనది కాదని బండి సంజయ్ అన్నారు.