నకిలీ సర్టిఫికెట్లపై ఐటీడీఏ లో విచారణ  

అమ్రాబాద్, వెలుగు: నల్లమల ఏజెన్సీ లో  కొందరు నకిలీ   సర్టిఫికెట్లతో  జాబ్స్ పొందినట్లు ఫిర్యాదులు రావడంతో ఐటీడీఏ అధికారులు గురువారం విచారణ చేపట్టారు.  కొందరు అర్హత లేకున్నా ఏజెన్సీ సర్టిఫికెట్ల  ద్వారా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, టీచర్, పంచాయతీ సెక్రటరీ, వీఆర్ఓ లుగా జాబ్స్ పొందినట్లు ఒక స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు  రమేశ్​, భీక్య, నిరంజనమ్మ, శ్రీనివాస్  ఐటీడీఏ అధికారులకు ఫిర్యాదు చేశారు.  

దీంతో   అధికారులు సర్టిఫికెట్ రీ వెరిఫికేషన్ లో భాగంగా గురువారం ఐదు మందిని విచారించారు.  ఐటీడీఏ పీఓ రోహిత్ గోపిడి, టీసీఆర్ అండ్ టిఐ మెంబర్, ఆర్డిఓ మాధవి, డీటీడీఓ ఫిరంగి, తహసీల్దార్ల ఆధ్వర్యంలో విచారించారు.  అనంతరం కలెక్టర్ కు నివేదికలు అందిస్తామన్నారు.