ఐటీబీపీలో 526 పోస్టులకు నోటిఫికేషన్​

ఇండో- టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్సు (ఐటీబీపీ) 526 ఎస్సై, హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్ ఖాళీలకు నోటిఫికేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విడుదల చేసింది. అభ్యర్థులు డిసెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 14వ తేదీలోగా ఆన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.

అర్హతలు: ఎస్సై పోస్టులకు డిగ్రీ లేదా బీటెక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌; హెడ్ ​​కానిస్టేబుల్ పోస్టులకు ఇంటర్మీడియట్​లేదా ఐటీఐ/ డిప్లొమా ; కానిస్టేబుల్ పోస్టులకు టెన్త్​ ఉత్తీర్ణులై ఉండాలి. వయసు ఎస్సై పోస్టులకు 20 నుంచి 25, హెడ్ ​​కానిస్టేబుల్ పోస్టులకు 18 నుంచి 25 ఏళ్లు, కానిస్టేబుల్ పోస్టులకు 18 నుంచి 23 ఏళ్ల మధ్య ఉండాలి.

సెలెక్షన్​ ప్రాసెస్​: ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, డాక్యుమెంటేషన్, రాత పరీక్ష, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. అర్హులైన అభ్యర్థులు ఆన్​లైన్​లో నవంబర్​ 15 నుంచి డిసెంబర్​ 14 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. వివరాలకు www.itbpolice.nic.in వెబ్​సైట్‌లో సంప్రదించాలి.