మెల్‌బోర్న్: ఓపెనింగ్ సమస్య ఆస్ట్రేలియాను మరికొంత కాలం వేధించేలా ఉంది. గ్రోయిన్ ఇంజ్యురీతో జట్టుకు దూరమైన డేవిడ్ వార్నర్ ఇప్పటికీ కోలుకోలేదు. అతను కోలుకోవడానికి ఇంకాస్త సమయం పడుతుందని ఆసీస్ టీమ్ కోచ్ జస్టిన్ లాంగర్ ఆదివారం తెలిపాడు. దీంతో జనవరి7న ఇండియాతో మొదలయ్యే థర్డ్ టెస్ట్‌లోనూ వార్నర్ ఆడటంపై సందేహాలు మొదలయ్యాయి. ఇండియాతో జరిగిన రెండో వన్డేలో గాయపడిన వార్నర్.. లాస్ట్ వన్డేతోపాటు టీ20 సిరీస్, తొలి రెండు టెస్టులకు దూరమయ్యాడు.
‘వార్నర్ కంటే ప్రొఫెషనల్ పర్సన్ మరొకరు ఉండరు. రికవర్ అయ్యేందుకే ఏమేం చెయ్యాలో అన్ని చేస్తున్నాడు. శుక్రవారం అతను బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశాడు. ఆదివారం కూడా ఎంసీజీలో ప్రాక్టీస్ చేశాడు. బ్యాటింగ్ విషయంలో వార్నర్‌కు ఎలాంటి సమస్యలు లేవు. కానీ గ్రోయిన్‌లో ఇబ్బంది ఇంకా తగ్గలేదు. వికెట్ల మధ్య రన్నింగ్, ఇతర కదలికల్లో రోజురోజుకి ఇంప్రూమెంట్ కనిపిస్తోంది. అతి త్వరలోనే జట్టులోకి వస్తాడని నమ్మకంగా ఉన్నాం. తర్వాతి మ్యాచ్‌కు ఇంకా టైముంది. కానీ ఈ లోపు ఏం జరుగుతుందో చూడాలి’ అని లాంగర్ చెప్పుకొచ్చాడు.
