మండుటెండల్లో చల్లటి వార్త.. ఎండ Vs వాన

దేశవ్యాప్తంగా ఎండలు దంచికొడుతుంటే  భారత వాతావరణ శాఖ కొన్ని రాష్ట్రాలకు గుడ్‌న్యూస్, కొన్ని రాష్ట్రాలకు బ్యాడ్‌న్యూస్ చెప్పింది. భారత్‍లో తూర్పు, ద్వీపకల్ప పీఠభూమి రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరుగనున్నాయని, వడగాల్పులు ప్రారంభమైవుతాయని తెలిపింది. ఒడిశా, పచ్చిమ బెంగాల్, జార్ఖాండ్, కర్ణాటక, కోస్తాంద్ర, యానాం, రాయలసీమ, తెలంగాణలో ఈరోజు, రేపు వడగాలలు వీస్తాయని IMD ప్రకటించింది. అలాగే ఈశాన్య రాష్ట్రాలు అస్సాం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, త్రిపుర, అరుణాచల్ ప్రదేశ్, పశ్చిమ బెంగాల్ పుదుచ్చేరి, తమిళనాడు రాష్ట్రాల్లో వర్షాలు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురువన్నాయి. 

ఉత్తర కర్ణాటక, రాయలసీమ, కోస్తా ఆంధ్ర ప్రదేశ్, యానాం మీదుగా హీట్ వేవ్ ఇప్పటికే  కొనసాగుతున్నాయి. ఈరోజో రేపో  తెలంగాణ, జార్ఖాండ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్ వడగాలులు విస్తరిస్తాయని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. సిక్కిం, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో రాబోయే ఏడు రోజులు మోస్తారు నుంచి తేలికపాటి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఏప్రిల్ ప్రారంభం నుంచి దేశంలోని చాలా ప్రాంతాల్లో 40 నుండి 42 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.