శ్రీహరికోట: పీఎస్ఎల్వీ సీ-60 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. పీఎస్ఎల్వీ సీ-60 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. ఛేజర్, టార్గెట్ ఉపగ్రహాలను కక్ష్యలోకి పీఎస్ఎల్వీ సీ-60 కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. శ్రీహరికోట సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ఈ రాకెట్ ప్రయోగం జరిగింది. అంతరిక్షంలోనే ఉపగ్రహాలను డాకింగ్, అన్ డాకింగ్ చేసేలా శాస్త్రవేత్తలు ఈ రాకెట్ను ప్రయోగించారు.
టార్గెట్, ఛేజర్ ఉపగ్రహాల బరువు 440 కిలోలు. ‘స్పేడెక్స్’ జంట ఉపగ్రహాలతో పాటు నానో శాటిలైట్లను కూడా PSLV C-60 అంతరిక్షంలోకి పంపింది. అంతరిక్ష వ్యర్థాలను తొలగించేలా ఉపగ్రహాలను శాస్త్రవేత్తలు రూపొందించారు. స్పేస్లోని శాటిలైట్లను ఈ రెండు ఉపగ్రహాలు అనుసంధానం చేయనున్నాయి. ‘స్పేటెక్స్’ పేరుతో జరిగిన పీఎస్ఎల్వీ సీ-60 ప్రయోగంతో ఆదిత్య ఎల్–1 సోలార్‌మిషన్ కొనసాగనుంది.
ఇప్పటికే పీఎస్ఎల్వీ సీ –59 ప్రయోగం విజయవంతమైన సంగతి తెలిసిందే. యురోపియన్స్పేస్ ఏజెన్సీ (ఈఎస్ఏ)కి చెందిన ప్రోబా–3తోపాటు మరికొన్ని ఉపగ్రహాలను నిర్ణీత కక్ష్యలోకి పీఎస్ఎల్వీ సీ –59 విజయవంతంగా చేర్చింది. ప్రయోగించిన 18 నిమిషాల్లోనే ప్రోబా–3 శాటిలైట్స్ను పీఎస్ఎల్వీ సీ–59 రాకెట్ విజయవంతంగా నిర్ణీత కక్ష్యలో ప్రవేశపెట్టింది. ఇస్రో ఈ ప్రయోగాన్ని న్యూస్పేస్ఇండియా లిమిటెడ్ (ఎన్ఎస్ఐఎల్) భాగస్వామ్యంతో చేపట్టింది.
— ANI (@ANI) December 30, 2024