సన్ రైజర్స్‎లోకి ముంబై స్టార్.. ఏకంగా రూ.11.25 కోట్లు

ముంబై ఇండియన్స్ ఆటగాడు ఇషాన్ కిషన్‎ను సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు కొనుగోలు చేసింది. మెగా వేలంలో రూ.11.25 కోట్లకు ఇషాన్ కిషన్‎ను ఎస్ఆర్‎హెచ్ దక్కించుకుంది. ఇషాన్ కిషన్ కోసం వేలంలో ఫ్రాంచైజ్‎లు పోటీ పడ్డాయి. ముందుగా ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య తీవ్ర పోటీ నడవగా.. చివర్లో ఎంట్రీ ఇచ్చిన ఎస్ఆర్‎హెచ్ అనుహ్యంగా ఇషాన్ కిషన్‎ను కొనుగోలు చేసింది. కాగా, ఐపీఎల్‎లో గత కొన్ని సీజన్లుగా ఇషాన్ కిషన్ ముంబై ఇండియన్స్ తరుఫున ఆడుతోన్న విషయం తెలిసిందే. 

ముంబైలో కీలక ప్లేయర్‎గా మారిన ఇషాన్‎ను వచ్చే సీజన్ కోసం ఆ జట్టు రిటైన్ చేసుకోలేదు. జట్టు కూర్పులో భాగంగా ఇషాన్ కిషన్‎ను రిటైన్ చేసుకోకుండా వేలానికి వదిలింది. దీంతో ఆక్షన్‎లోకి వచ్చిన ఇషాన్ కిషన్‎ను సన్ రైజర్స్ హైదరాబాద్ కొనుగోలు చేసింది. మెగా వేలంలో ఇప్పటి వరకు ఎస్ఆర్‎హెచ్.. మహ్మద్ షమీ రూ.10 కోట్లు, ఇషాన్ రూ.11.25 కోట్లు, హర్షల్ పటేల్ రూ.8 కోట్లకు కొనుగోలు చేసింది.