Team India: ఇకనైనా బుద్ధిగా ఉండు కొడకా..! భారత యువ క్రికెటర్‌కు తల్లి సలహా

ఆకు వెళ్లి ముల్లు మీద పడ్డా, ముల్లు వచ్చి ఆకు మీద పడ్డా ఆకుకే నష్టం.. ఈ సామెత అర్థం తెలుసు కదా..!.బలహీనుడు తనకు తానుగా బలవంతునితో తలపడినా, లేదా బలవంతుడే వచ్చి బలహీనునితో తలపడినా జరిగే నష్టం బలహీనునికే. కావున బలహీనుడు తన పరిమితులను గుర్తెరిగి ప్రవర్తించవలెను. ఇది తెలియని భారత యువ క్రికెటర్ ఇషాన్ కిషన్ టీమ్ మేనేజ్మెంట్(బీసీసీఐ) సలహాలను, సూచనలను ధిక్కరించడం.. ఆ తరువాత సెంట్రల్ కాంట్రాక్టు కోల్పోవడం అందరికి తెలిసిందే. ఈ పరిణామాల నడుమ అతనికి మరోసారి చక్కని అవకాశమొచ్చింది. 

Also Read :- పూణే టెస్టులో టీమిండియా ఓటమి

మొదట మేనేజ్మెంట్ సూచలనలను ధిక్కరించినప్పటికీ, ఆ తరువాత తప్పు తెలుసుకొని ఈ క్రికెటర్.. దేశవాళీ క్రికెట్ బాట పట్టాడు. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ విలువైన పరుగులు సాధించాడు. రైల్వేస్‌తో ఆడిన తన చివరి మ్యాచ్‌లో ఏకంగా సెంచరీ(101) బాదాడు. దాంతో, అతనికి భారత సెలెక్టర్ల నుంచి పిలుపొచ్చింది. ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లే ఇండియా -ఏ జట్టులో కిషన్‌కు బీసీసీఐ సెలక్షన్ ప్యానెల్ చోటు కల్పించింది. ఈ క్రమంలో అతను శనివారం(అక్టోబర్ 26) ఇంటి నుండి బయలుదేరి వెళ్తుండగా.. తల్లి సుచిత్రా సింగ్ ఇకనైనా పదిలంగా ఉండు కొడకా.. అంటూ సాగనంపింది. 

వైరల్ అవుతున్న వీడియోలో కిషన్ ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్తున్నప్పుడు కుటుంబసభ్యులు భావోద్వేగంతో అతనికి వీడ్కోలు పలుకుతున్నారు. ముఖ్యంగా కిషన్ తల్లి తన కొడుకు విమానాశ్రయానికి బయలుదేరే ముందు ఆప్యాయంగా కౌగిలించుకోవడం చూడవచ్చు. వీరి సంభాషణపై ఓ నెటిజన్ ఛలోక్తులు విసిరాడు. తనకు లిప్ రీడింగ్ తెలుసన్నట్టు.. వారి మధ్య  జరిగిన సంభాషణను ఫన్నీగా పోస్ట్ చేశాడు. 'అతని నుంచి మంచి ప్రదర్శన ఆశిస్తున్నామని సూచిస్తేనే.. ఇకనైనా బుద్ధిగా ఉండు కొడకా..! మేనేజ్మెంట్ సూచనలు ధిక్కరించకు..' అని చెప్పినట్టు చెప్పుకొచ్చాడు.     

ఆస్ట్రేలియా పర్యటనకు ఇండియా- ఏ జట్టు:

రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), అభిమన్యు ఈశ్వరన్ (వైస్ కెప్టెన్), సాయి సుదర్శన్, నితీష్ కుమార్ రెడ్డి, దేవదత్ పడిక్కల్, రికీ భుయ్, బాబా ఇంద్రజిత్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), అభిషేక్ పోరెల్ (వికెట్ కీపర్), ముఖేష్ కుమార్, ఖలీల్ అహ్మద్, యష్ దయాల్, నవదీప్ సైనీ, మానవ్ సుతార్, తనుష్ కోటియన్.