ఏపీ కోరగానే ఆగమేఘాల మీద రియాక్షన్
శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తి ఆపాలంటూ తెలంగాణకు ఆదేశం
పోతిరెడ్డిపాడు టెండర్ల ముచ్చటే పట్టించుకోని బోర్డు
హైదరాబాద్, వెలుగు: కృష్ణా రివర్ మేనేజ్ మెంట్ బోర్డు (కేఆర్ ఎంబీ) మరోసారి ఏపీ పక్షపాతాన్ని చాటుకుంది. ఏపీ వాటర్ రీ సోర్సె స్ డిపార్ట్ మెంట్ కు చెందిన ముఖ్యుడి వాట్సప్ మెసేజ్ కు ఉరుకులు పరుగులు పెట్టింది. శ్రీశైలం ఎడమ గట్టు పవర్ స్టేషన్ ద్వారా వెంటనే కరెంట్ ఉత్పత్తి నిలిపివేసి నాగార్జునసాగర్ కు నీటి విడుదలను ఆపాలని తెలంగాణను ఆదేశించింది. సోమవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఏపీ అబ్జెక్షన్స్ పై చర్చించి వెంటనే నీటి విడుదల ఆపాలని తెలంగాణ ఇరిగేషన్ ఈఎన్సీకి లేఖ రాసింది. తెలంగాణ పవర్ జనరేషన్, సాగర్ కు నీటి విడుదలను ఆపాలంటూ ఆగమేఘాల మీద రియాక్ట్ అయిన కృష్ణా బోర్డు.. పోతిరెడ్డిపా డు (సంగమేశ్వరం) లిఫ్ట్ పనులకు ఏపీ టెండర్లు పిలిచినా కనీసం ఆపాలంటూ ఒక్క లెటర్ కూడా రాయలేదు.
అలా ఫిర్యాదు.. ఇలా ఆదేశం
శ్రీశైలం ప్రాజెక్టుకు ఎగువ నుంచి నిలకడగా ప్రవాహాలు వస్తుండటంతో ఆదివారం సాయంత్రం టీఎస్ జెన్ కో ఆఫీసర్లు శ్రీశైలం లెఫ్ట్ పవర్ స్టేషన్ లో కరెంట్ ఉత్పత్తి ప్రారంభించారు. పవర్ జనరేషన్ కు విడుదల చేసిన నీటిని రివర్సబు ల్ మోటార్ల ద్వారా మళ్లీ శ్రీశైలంలోనే ఎత్తిపోయకుండా కృష్ణా నదిలోకి విడుదల చేశారు. ఆ నీళ్లు సాగర్ కు చేరాయి. 12 గంటల్లోనే ఏపీ ప్రభుత్వం రియాక్ట్ అయింది. కేఆర్ఎంబీ ఆదేశాలు లేకుండానే తెలంగాణ పవర్ జనరేషన్ మొదలు పెట్టిందని శ్రీశైలం ప్రాజెక్టు ఎస్ఈ ఏపీ ఈఎన్సీకి సమాచారమిచ్చారు. ఈఎన్సీ ఆదేశాలతో కేఆర్ఎంబీ మెంబర్ సెక్రటరీకి సోమవారం ఉదయం శ్రీశైలం ప్రాజెక్టు ఎస్ ఈ లేఖ రాశారు. ఆ లేఖను మెయిల్ చేసిన కొన్ని నిమిషాల్లోనే ఏపీ ఇరిగేషన్ ఈఎన్సీ నారాయణరెడ్డి బోర్డు చైర్మన్, మెంబర్ సెక్రటరీకి వాట్సప్ లో మెసేజ్ పెట్టారు. వెంటనే సాగర్ కు నీటి విడుదలను ఆపాలని తెలంగాణను ఆదేశించాలని కోరారు. ఏపీ ఈఎన్సీ వాట్సప్ మెసేజ్ తో అప్పటికప్పుడు బోర్డు పెద్దలు స్పందిం చి కేఆర్ఎంబీ ఆదేశాలు లేకుండా సాగర్ కు నీటిని విడుదల చేస్తున్నందున వెంటనే నిలిపి వేయాలని ఆదేశించారు. కేఆర్ఎంబీకి తెలంగాణ, ఏపీ నుంచి గతంలో ఎన్నో సందర్భాల్లో ఎన్నో కంప్లయింట్లు వచ్చాయి. దాదాపు అన్ని కంప్లయింట్లు ఈఎన్సీల నుంచే వస్తుంటాయి. కొన్ని సందర్భాల్లో మాత్రమే ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్లు ఫిర్యాదులు పంపుతుంటారు. వాటిపై బోర్డు ఇంత ఫాస్ట్ గా రియాక్ట్ అయిన సందర్భాలు గతంలో లేవు. అలాంటిది శ్రీశైలం ప్రాజెక్టు ఎస్ఈ కేఆర్ ఎంబీ మెంబర్ సెక్రటరీకి రాసిన లేఖను పరిగణనలోకి తీసుకొని తెలంగాణ ఈఎన్సీకి బోర్డు లేఖ రాయడం చర్చనీయాంశమైంది. ఎస్ఈ రాసిన లేఖతో పాటు ఏపీ పంపిన వాట్సప్ మెసేజ్ ను పరిగణనలోకి తీసుకొని లేఖ రాస్తున్నట్టుగా బోర్డు మెంబర్ సెక్రటరీ పేర్కొన్నారు. ఇరిగేషన్ అవసరాలు లేకుండా జల విద్యుత్ ఉత్పత్తి చేయడం రూల్స్ కు వ్యతిరేకమని చెప్పారు.
పోతిరెడ్డిపాడుపై ఒక్క లెటర్ రాయలేదే?
ఏపీ ప్రభుత్వం 203 జీవోలో భాగంగా నిర్మించ తలపెట్టిన పోతిరెడ్డిపా డు హెడ్ రెగ్యులేటర్ విస్తరణ విషయంలో ముందుకెళ్లవద్దని జూన్ 4న నిర్వహిం చిన బోర్డు మీటింగ్ లో ఆదేశించారు. కేంద్ర జలశక్తి శాఖ జోక్యం తోనే కేఆర్ఎంబీ ఈ ప్రాజెక్టులను ఆపాలని ఆదేశించింది తప్ప తనకు తానుగా నిర్ణయం తీసుకొని కాదు. ఏపీ ప్రభుత్వం పోతిరెడ్డిపాడు పనులపై వేగంగా చర్యలు చేపడుతున్నా.. టెండర్ నోటిఫికేషన్ ను జ్యుడీషియల్ ప్రివ్యూకు పంపి నా.. వాటిని ఆపాలని కనీసం ఆదేశించే ప్రయత్నం బోర్డు చేయలేదు. ఏపీ ప్రాజెక్టుల విషయంలో ఒకలా, తెలంగాణ విషయంలో మరోలా వ్యవహరించడం కృష్ణా బోర్డుకు ఇప్పుడే కొత్తకాదన్న విమర్శలు ఉన్నా యి. గతేడాది ఫ్లడ్ సీజన్ లో జారీ చేసిన ఫస్ట్ వాటర్ రిలీజ్ ఆర్డర్ లో పోతిరెడ్డిపా డు నుంచి 19 టీఎంసీలు తీసుకోవడానికే ఓకే చెప్పింది. ఏపీ అంతకు ఐదు రెట్లు అంటే 90 టీఎంసీలకు పైగా నీటిని డ్రా చేసినా కనీసం ఆపమనే ప్రయత్నం కూడా బోర్డు చేయలేదు.
రిలీజ్ ఆర్డర్ లేకుండా నే ఏపీ నీటి విడుదల?
కేఆర్ఎంబీ నుంచి ఎలాంటి రిలీజ్ ఆర్డర్ లేకుండా నే ఏపీ ప్రభుత్వం సోమవారం సాయంత్రం 7 గంటలకు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ గేట్ల ద్వారా నీటిని కిందికి వదిలినట్టు తెలిసింది. 246 క్యూసెక్కుల నీటిని పోతిరెడ్డిపాడు నుంచిదిగువకు వదిలినట్టుగా సమాచారం. రెండు రాష్ట్రా లకు కామన్ ప్రాజెక్టుగా ఉన్న సాగర్ లోకి నీటిని విడుదల చేస్తూ శ్రీశైలంలో కరెంట్ ఉత్పత్తి చేయడాన్ని తప్పు బట్టిన ఏపీ కొన్ని గంటల్లోనే ఏకపక్షంగా పోతిరెడ్డిపా డు నుంచి తమ రాష్ట్ర
సాగునీటి అవసరాల కోసం నీటి విడుదల మొదలు పెట్టింది. తెలంగాణను నీటి విడుదల ఆపాలంటూ ఆదేశించిన కృష్ణా బోర్డు మరి ఏపీ ప్రభుత్వం అక్రమంగా తరలిస్తున్న నీటి విషయంలో ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి. మరోవైపు హంద్రీనీవా సుజల స్రవంతి లిఫ్ట్ స్కీం ద్వారా మంగళవారం ఎత్తిపోతలను ఏపీ ప్రారంభించనున్నట్టు తెలిసింది. ఒకటి రెండు రోజుల్లో ముచ్చుమర్రి పంపులను కూడా నడపాలని నిర్ణయించినట్టుగా సమాచారం.
