మధుమేహం వ్యాధితో బాధపడే వాళ్లకు ఆకలి ఎక్కువగా ఉంటుందంటారు. ఆకలేసిన ప్రతిసారీ ఏది పడితే అది తింటే శరీరంలో చక్కెర శాతం మరింత అధికమయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి కొర్రలు, సామలు లాంటి చిరుధాన్యాలతో చేసిన ఆహారం తింటే ఆకలి తీరడంతో పాటు ఆరోగ్యమూ బాగుంటుంది. చిరుధాన్యాలను ఒక పద్ధతిలో తింటే వ్యాధి కూడా నయమవుతుంది. అంటున్నారు డాక్టర్లు. కొన్ని రకాల ధాన్యాలను ఒక క్రమంలో వండుకుని తినాలి. ఇలా తింటే షుగర్ అదుపులో ఉంటుంది.
కొర్రలు రెండు రోజులు, సామలు రెండు రోజులు, అరికలు రెండు రోజులు, ఊదలు రెండు రోజులు, అండు కొర్రలు రెండు రోజులు తీసుకోవాలి. ముందుగా ఈ ధాన్యాలను ఒకేసారి తెచ్చిపెట్టుకోవాలి. అలా చేస్తే వండుకునేటప్పుడు. ఇబ్బంది ఉండదు. వీటిని వండటానికి ముందు 3 నుంచి 6 గంటల పాటు నానబెట్టాలి. వీటిలో కొవ్వు శాతం తక్కువగా ఉంటుంది.
ALSO READ : Good Health: చలికాలంలో లవంగాలు చేసే మేలు అంతా ఇంతా కాదు.. ఈ వ్యాధులను ఇట్టే నయం చేస్తాయి..!
అలాగే ఫైబర్ శాతం కూడా ఎక్కువ.అందువల్ల ఊబకాయంతో ఇబ్బంది పడేవాళ్లు, బరువు తగ్గాలి అనుకునే వాళ్లు క్రమం తప్పకుండా తీసుకుంటే మంచిది. తప్పకుండా వాళ్ల శరీర బరువులో మార్పు కనిపిస్తుందంటున్నారు బరువు తగ్గిన వాళ్లు.
== V6 వెలుగు లైఫ్