చలిలో వ్యాయామం ఇబ్బందిగా ఉందా..? అయితే ఇలా చేయండి

గడ్డకట్టే చలిలో బయట అడుగుపెట్టాలంటేనే ఒకటికి, రెండుసార్లు ఆలోచిస్తాం. మరి ఎక్సర్ సైజ్ చేయాలంటే చాలా ఇబ్బంది. వణికించే చలిలో రన్నింగ్, జాగింగ్ చేయాలంటే చాలామంది భయపడతుంటారు. కొంచెం కొత్తగా ప్రయత్నిస్తే చలిలోనూ ఎంచక్కా ఎక్సర్ సైజ్ లు చేయొచ్చు అంటున్నారు ఫిట్ నెస్ నిపుణలు.

కొంతమంది సింగిల్గా వ్యాయామాలు చేస్తుంటారు. అలా కాకుండా గ్రూపుతో జతకడితే సులభంగా చేయొచ్చు. బృందంగా వ్యాయామాలు చేయడం వల్ల కొత్త ఉత్సాహం వస్తుంది. ఆరోగ్యకరమైన జీవన శైలిఅలవడుతుంది. 

Also Read :- డీజే, ఆల్కహాల్ లేకుండా పెళ్లి చేసుకుంటే రివార్డు

ఇంటి వద్ద వ్యాయామం చేయడానికి బద్ధకంగా ఉంటే, స్మార్ట్ ఫోన్ యాప్స్ ను ఉపయోగించుకోవాలి. వీటి సాయంతో చురుగ్గా ఇంటి వద్దే వ్యాయామం చేసుకోవచ్చు. శరీరానికి తగ్గట్టుగా వ్యాయామాలను ఎంచుకోవాలి. 

ఇంకా చేతులకు గ్రోవ్స్, తలకు బ్యాండ్స్ ధరించాలి.. ఇవి వెచ్చదనాన్ని అందిస్తాయి. అప్పుడే మెరుగైన ఫలితాలు అందుతాయి.